బాలీవుడ్ సీనియర్ వెటరన్ నటి, ‘ఢిల్లీ క్రైమ్’ ఫేమ్ షెఫాలీ షా (Shefali Shah) నేటి తరం వివాహ బంధాలు, పిల్లల పెంపకంపై చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. “పిల్లలను కనడం కంటే కుక్కలను పెంచుకోవడం బెటర్” అనే అర్థం వచ్చేలా ఆమె మాట్లాడిన బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
షెఫాలీ షా మాట్లాడుతూ.. ‘మనకు మన గురించి, మన ఇష్టాలు, అభిరుచులు, లక్ష్యాల గురించి కనీస స్పష్టత లేకుండానే తొందరపడి పెళ్లి చేసుకోవడం సరైన నిర్ణయం కాదు. ముందుగా జీవితాన్ని అనుభవించాలి, ప్రపంచాన్ని చూడాలి, మనుషులను అర్థం చేసుకోవాలి. ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలి. ఎందుకంటే పెళ్లి అనేది ఒక పెద్ద బాధ్యతతో కూడుకున్న వ్యవస్థ, దాన్ని సజావుగా కొనసాగించడం అంత సులభం కాదు. అందులోను పిల్లలను కని వారిని సరిగ్గా పెంచలేక ఇబ్బందులు పడేదానికంటే, ఎంతో నమ్మకంగా ఉండే కుక్కలను (Pet Dogs) పెంచుకోవడం ఎంతో మేలు’ అని ఆమె వ్యాఖ్యానించారు. పెంపుడు జంతువులు ఇచ్చే నిస్వార్థమైన ప్రేమ, మనుషుల బంధాల్లో కరువవుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.
షెఫాలీ షా చేసిన ఈ కామెంట్స్‌పై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. నేటి తరం యువత ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను, పెళ్లి తర్వాత పడుతున్న ఇబ్బందులను ఆమె కరెక్ట్‌గా ప్రతిబింబించారంటూ కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. మరికొందరేమో భారతీయ కుటుంబ వ్యవస్థను, పిల్లల పెంపకంలోని మధురానుభూతిని కుక్కలతో పోల్చడం సరికాదంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా షెఫాలీ షా మార్క్ బోల్డ్ ఇంటర్వ్యూ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
