Sharwanand : బైకర్ కోసం శర్వా ఇలా అయిపోయాడేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శర్వానంద్ తన 36వ చిత్రంతో ప్రేక్షకులను పూర్తిగా ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమయ్యారు. స్పోర్ట్స్ & ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘బైకర్’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. దీపావళి కానుకగా విడుదలైన టైటిల్ & ఫస్ట్ లుక్ పోస్టర్, సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ఈ చిత్రంలో శర్వా ఒక ప్రొఫెషనల్ మోటార్‌సైకిల్ రేసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆయన ‘జా-డ్రాపింగ్’ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సాధించారు. తాజాగా విడుదలైన ఫోటోషూట్ స్టిల్స్‌లో శర్వా కొత్త లుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. షర్ట్‌లెస్ లుక్స్‌లో, ఎంతో షార్ప్‌గా ఉన్న అబ్స్‌తో, రేసర్‌కు ఉండాల్సిన తీక్షణమైన చూపు(ఫైరీ గేజ్)తో అద్భుతమైన స్పిరిట్‌ను ప్రదర్శించారు.
Also Read:Pradeep Ranganathan: 100 కోట్ల క్రెడిట్ తెలుగు ఆడియెన్స్‌కి ఇచ్చిన ‘డ్యూడ్’..
Also Read
- Prabhas Sreenu: "ఆ వార్తలు చదివి చాలా బాధపడ్డా".. సినియర్ యాక్టర్‌తో రూమర్స్‌పై ప్రభాస్ శ్రీను రియాక్షన్
- Prabhas: "నా జీవితంలో ప్రభాస్ దేవుడిలాంటి వ్యక్తి"
- Prabhas Sreenu: "ప్రభాస్ దగ్గర డబ్బు అడగాల్సిన అవసరమే రాదు.. ఎందుకంటే!"
- Prabhas Srinu: "అర్ధరాత్రి అడవిలో నాటుకోడి కోసం వేట.. ప్రభాస్ కోసం చేసిన పని చెప్పిన ప్రభాస్ శ్రీను!"
నెలల తరబడి కఠినమైన వర్కౌట్స్, ఖచ్చితమైన డైట్ మరియు పూర్తి డెడికేషన్‌తో శర్వా ఈ లీన్ అండ్ అథ్లెటిక్ బాడీని సొంతం సాధించారు. ఇంత ఫిట్‌గా, ఎనర్జిటిక్‌గా శర్వా కనిపించడం ఆసక్తికరం. ‘బైకర్’ చిత్రంలో శర్వా సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాకి జిబ్రాన్ సంగీతం సమకూరుస్తుండగా, జె. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అనిల్ కుమార్ పి ఎడిటర్‌గా, రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఎ. పన్నీర్ సెల్వం ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్‌తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్‌హౌస్‌కు జెలెన్స్కీ.. ట్రంప్‌తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!