Site icon NTV Telugu

Sharukhan : షారుఖ్‌ కోసం.. దీపిక ఒప్పుకోవాల్సి వచ్చింది..!

Teja Sajja,'mirai',daggubati Rana, (1)

Teja Sajja,'mirai',daggubati Rana, (1)

బాలీవుడ్‌ హిట్ కాంబీనేషన్ లో షారుఖ్‌, దీపికా పడుకోన్‌ జంట ఒకటి. హిట్‌పెయిర్‌గా వారికి మంచి గుర్తింపు సంపాదించుకుని ఇప్పటివరకు ఐదు చిత్రాల్లో నటించగా..అవన్నీ సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. ఇక తాజాగా ఈ జోడీ ‘కింగ్‌’ సినిమాలో నటించనుందట. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో షారుఖ్‌ఖాన్‌ తనయ సుహానా ఖాన్‌ ప్రధాన పాత్ర లో నటిస్తుండగా, ఈ చిత్రంతో సుహానాఖాన్‌‌కు గురువు పాత్రలో షారుఖ్‌ఖాన్‌ కనిపించబోతున్నాడు. కాగా ఈ సినిమాలో దీపికా పడుకోన్‌ అతిథి పాత్రలో నటిస్తుందంటూ వార్తలొచ్చాయి. అయితే..

Also Read: Rakul : ఆస్తులన్ని తాకట్టు పెట్టిన ఫలితం లేకుండా పోయింది.. అంటున్న ర‌కుల్ భ‌ర్త

మొదట ఈ సినిమా కోసం ‘కింగ్‌’ టీమ్‌ తనను సంప్రదించినప్పుడు దీపికా సున్నితంగా తిరస్కరించిందట. ఎందుకంటే.. ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలతో పాటు ఒక తల్లిగా పర్సనల్‌ లైఫ్‌కు సమయాన్ని కేటాయించాల్సి ఉందని, కొత్త సినిమాలు సైన్‌ చేయలేనని చెప్పిందట ఈ అమ్మడు. దీంతో ఈ అతిథి పాత్ర కోసం కత్రినాకైఫ్‌, సోనమ్‌ బజ్వా, ప్రీతిజింటా వంటి హీరోయిన్‌లను సంప్రదించారు. వారు కూడా పలు కారణాలతో ఒప్పుకోక పోవడంతో చివరకు షారుఖ్‌ఖాన్‌ రంగంలో దిగారట. దీపికా పడుకోన్‌ను ఫోన్‌లో సంప్రదించి ‘ఎలాగైనా అతిథి పాత్రలో నటించాలని.. ఆమె డేట్స్‌ కోసం అవసరమైతే షూటింగ్‌ షెడ్యూల్స్‌ను మార్చుతామని’ హామీ ఇచ్చారట షారుఖ్‌. ఇక ఆయన రిక్వెస్ట్‌ మేరకు చివరకు దీపికా సినిమాకు ఓకే చెప్పిందని టాక్. కాగా ఈ సినిమా మేలో మొదలుపెట్టి ఆగస్ట్‌లోగా పూర్తి చేయాలని ప్లాన్‌ చేశారట. కానీ దీపికా పడుకోన్‌ కాల్షీట్స్‌ అక్టోబర్‌లో అందుబాటులో ఉండటంతో అప్పటి వరకు వేచిచూడాలని మేకర్స్‌ నిర్ణయం తీసుకున్నారట.

Exit mobile version