చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో సినీ నటుడు, బీజేపీ నేత శరత్ కుమార్ తమిళనాడు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మదురై తిరుపరంకుండ్రం దీపం వివాదం మొదలుకొని, రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల వరకు పలు అంశాలపై ఆయన కుండబద్దలు కొట్టారు. మదురై తిరుపరంకుండ్రం దీపం వెలిగించే విషయంలో తలెత్తిన వివాదంపై శరత్ కుమార్ స్పందిస్తూ.. ప్రస్తుత సమాజంలో హిందువుల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. “నేడు హిందువులుగా ఉన్నవారు తాము హిందువులమని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారని, అసలు ‘హిందూ’ అనే పదాన్నే మర్చిపోయే పరిస్థితి వచ్చిందని” ఆయన కామెంట్ చేశారు. హిందూ ధర్మం పట్ల జరుగుతున్న వివక్షను ఆయన ఈ సందర్భంగా ఎండగట్టారు.
Also Read :Sharwa: డిజాస్టర్ డైరెక్టర్’తో శర్వా నెక్స్ట్?
వచ్చే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని శరత్ కుమార్ స్పష్టం చేశారు. అయితే రాజకీయాలకు దూరం కావడం లేదని, కేవలం ఎన్నికల బరిలో నిలబడబోనని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, పార్టీ తరఫున తన ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తానని చెప్పారు. తమిళనాడులో ప్రస్తుత డిఎంకే (DMK) ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా శ్రమిస్తానని పేర్కొన్నారు. తనకు పోటీ చేసే అవకాశం వచ్చినా, దాన్ని ఇతరులకు ఇచ్చి ప్రోత్సహిస్తానని ఆయన వెల్లడించారు.
Also Read :Jana Nayagan: రివర్స్ రీమేక్.. దూరమైన సితార
తమిళ సూపర్ స్టార్ విజయ్ రాజకీయ పార్టీ (TVK) స్థాపనపై శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. “నేను విజయ్‌ను రాజకీయ నాయకుడిగా చూడటం లేదు. రాజకీయాల్లో ఎవరికి ఏది మంచో, ఏది చెడ్డదో ఆయనకు ఇంకా తెలియదు” అని శరత్ కుమార్ అభిప్రాయపడ్డారు. విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఆయన అప్పుడే ఒక అంచనాకు రాలేమని, రాజకీయ క్షేత్రంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో అనుభవం అవసరమని పరోక్షంగా కామెంట్ చేశారు. మొత్తానికి శరత్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు హిందూత్వ రాజకీయాల పరంగా, ఇటు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమీకరణాల పరంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.
