Site icon NTV Telugu

Aadi Saikumar : షూటింగ్ లో హీరోకి గాయాలు.. అయినా వెనక్కి తగ్గకుండా?

Aadi Saikumar

Aadi Saikumar

టాలీవుడ్‌లో కంటెంట్ ఉన్న సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ప్రస్తుతం అదే కోవలో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోన్న చిత్రం ‘శంబాల’. విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ప్రాణం పెట్టి పనిచేస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను అత్యంత సహజంగా, భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ క్రమంలో హీరో ఆది సాయికుమార్ సెట్‌లో తీవ్రంగా గాయపడటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Also Read:Yellamma : హీరోగా దేవిశ్రీ ప్రసాద్.. అనౌన్స్ మెంట్ రాబోతుంది

షూటింగ్లో భాగంగా ఒక కీలకమైన భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను రాత్రి సమయంలో చిత్రీకరిస్తున్నారు. చాలా మంది నటీనటులు పాల్గొన్న ఈ ఫైట్ సీన్‌లో అనుకోకుండా ఆదికి తీవ్ర గాయాలయ్యాయి. సాధారణంగా ఇలాంటి సమయంలో ఎవరైనా బ్రేక్ తీసుకుంటారు, కానీ ఆది మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. తన వల్ల షూటింగ్‌కు ఆటంకం కలగకూడదని, యూనిట్ పడుతున్న శ్రమ వృథా కాకూడదని భావించిన ఆయన, ఆ నొప్పితోనే రాత్రంతా చిత్రీకరణలో పాల్గొన్నారు. సినిమా పట్ల ఆది చూపించిన ఈ నిబద్ధతను చూసి సెట్‌లోని యూనిట్ సభ్యులంతా ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Also Read:Sukumar : ‘అవతార్: ఫైర్ అండ్ యాష్ పై సుకుమార్ సెన్సేషనల్ కామెంట్స్

‘శంబాల’ చిత్రం కేవలం అంచనాలకే పరిమితం కాకుండా, ట్రేడ్ వర్గాల్లో కూడా సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా బిజినెస్ పరంగా ఇప్పటికే హాట్ కేక్‌లా అమ్ముడైపోయింది. భారీ ధరలకు ఓటీటీ మరియు శాటిలైట్ హక్కులు అమ్ముడయ్యాయని అంటున్నారు. నైజాం ఏరియాలో మైత్రి లాంటి అగ్ర సంస్థ, ఏపీ మరియు సీడెడ్‌లో ఉషా పిక్చర్స్ వంటి ప్రముఖ సంస్థలు ఈ సినిమా పంపిణీ బాధ్యతలు చేపట్టాయి. దీనివల్ల నిర్మాతలు విడుదల కంటే ముందే లాభాల్లోకి రావడం విశేషం. యగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్ వంటి ప్రతిభావంతులైన తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం, నేపథ్య సంగీతం (RR) ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కాబోతున్న ‘శంబాల’, ఆది కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version