NTV Telugu Site icon

వెబ్ సిరీస్ లో ప్రశాంత్ కిషోర్ బయోపిక్!

ప్రశాంత్ కిషోర్ తెలుగు వాళ్లకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయ వ్యహకర్తగా పలు రాష్ట్రాల్లో పలానా పార్టీని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టడంలో ఆయన పాత్ర ప్రత్యేకం. నరేంద్ర మోదీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మమత బెనర్జీ.. ఇలా చాలా మందిని అగ్రపీఠంలో కూర్చోబెట్టాడు. అయితే తాజాగా ఆయన జీవితం ఆధారంగా ఓ వెబ్ సిరీస్ చేయాలని బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ప్లాన్ చేస్తున్నారట. తాజాగా షారుక్ పీకేతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ వెబ్ సిరీస్ రానున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో షారుక్ ఖాన్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడేమోనన్న వార్తలు సైతం బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం షారుఖ్-సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ‘పఠాన్’ సినిమా చేస్తున్నాడు.

Show comments