Shah Rukh Khan: ‘కింగ్’ నిర్మాతలపై కాసుల వర్షం.. మ్యూజిక్ రైట్స్‌తోనే సరికొత్త చరిత్ర!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shah Rukh Khan: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే రిలీజ్‌కి ముందే ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో సంచలనం సృష్టిస్తున్నట్లు బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ‘కింగ్’ మ్యూజిక్ రైట్స్ విలువ దాదాపు రూ.50 కోట్లకు చేరువలో ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ రైట్స్ కోసం ప్రముఖ మ్యూజిక్ సంస్థలు తీవ్ర పోటీ పడినట్లు సమాచారం. సోనీ మ్యూజిక్, సారిగామా, జీ మ్యూజిక్, టీ మ్యూజిక్ వంటి సంస్థలు బిడ్డింగ్‌లో పాల్గొనడంతో డీల్ విలువ రికార్డు స్థాయికి చేరిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ డీల్ షారుక్ ఖాన్ గత చిత్రాలైన ‘పఠాన్’, ‘జవాన్’ మ్యూజిక్ రైట్స్ రికార్డులను అధిగమించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ‘పఠాన్’ మ్యూజిక్ రైట్స్ సుమారు రూ.30 కోట్లకు, ‘జవాన్’ ఆడియో హక్కులు రూ.36 కోట్ల వరకు అమ్ముడైనట్లు సమాచారం. ఇప్పుడు ‘కింగ్’ ఆ రికార్డులను దాటి కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి సచిన్–జిగర్ సంగీతం అందిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు. భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాను 2026 క్రిస్మస్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ‘కింగ్’పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మ్యూజిక్ రైట్స్ డీల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. 'ఉప్పెన' హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
- Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?