కరోనా సెకండ్ వేవ్ దేశంలో కల్లోలం సృష్టిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలోనూ చాలామంది ప్రముఖులు ఇప్పటికే కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ ఎడిటర్ కరోనాతో కన్నుమూశారు. సీనియర్ ఎడిటర్, సీనియర్ నటి ప్రభ సోదరుడు ఎన్ జీవి ప్రసాద్ కరోనాతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు.
మే 3 నుంచి చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరి కరోనాకు చికిత్స తీసుకుంటున్న ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా మారడంతో ఈరోజు కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు ప్రసాద్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఇక నటి ప్రభకు ఇద్దరు సోదరులు ఉన్నారు. అందులో చిన్న సోదరుడు ప్రసాద్. ప్రసాద్ పలు తెలుగు తమిళ సినిమాలకు ఎడిటర్ గా పని చేశారు. ఆయన చిరంజీవి సినిమాలకి కూడా పనిచేశారు.