Site icon NTV Telugu

Senior Actresses : టాలీవుడ్‌ను పక్కన పెట్టేసిన సీనియర్ భామలు

Samantha

Samantha

సీనియర్ భామలకు టాలీవుడ్‌ను పక్కన పెట్టేస్తున్నారా అంటేఅవుననే సమాధానం వినిపిస్తోంది. సమంత, నిత్యామీనన్, చందమామ కాజల్, రకుల్, నయనతార, తమన్నా వీరంతా ఒకప్పడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన నటీమణులు.కానీ ఇప్పుడు టాలీవుడ్ ను పూర్తిగా మరిచారు. గ్లామర్ రోల్స్ పోషించేశాం.. ఇక కంటెంట్ బేస్డ్ కథలకే మా ఓట్ అంటున్నారు సీనియర్ భామలు. అందుకే ఒకటికి రెండు సార్లు ఆలోచించి గాని సినిమాలు ఒకే చేయట్లేదు. దీంతో మూవీ మూవీకి మధ్య భారీ గ్యాప్ వస్తోంది. మరికొంత మంది ఇతర భాషల మోజులో టాలీవుడ్ ను పక్కన పెడుతున్నారు. ఖుషి తర్వాత సమంత తెలుగులో సినిమా చేయలేదు. సొంత నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి మా ఇంటి బంగారం అంటూ ఎనౌన్స్ చేసింది కానీ అది అలా మూలకు వెళ్ళింది.

Also Read : THEPARADISE : నాని సినిమాలో విలన్ గా మంచు మోహన్ బాబు

పక్కింటామ్మాయిలా కనిపించే నిత్యామీనన్ మెల్లిగా తెలుగు పరిశ్రమ నుండి దూరంగా వెళ్ళింది.భీమ్లా నాయర్ తర్వాత తెలుగులో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయలేదు. తమిళ్ లో ధనుష్ సినిమా సూపర్ హిట్ కాగా జయం రవితో సినిమా సెట్స్ పై ఉంది. రకుల్ కూడా సేమ్ సీన్. కొండ పొలం తర్వాత స్ట్రయిట్ తెలుగు సినిమా చేయలేదు. కాస్తో, ,కూస్తో చందమామ కాజల్, క్వీన్ అనుష్క అడపా దడపా సినిమాలు చేస్తున్నరు. కాజల్ గతేడాది బాలయ్య సరసన భగవంత్ కేసరిలో అలరించి సత్యభామ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో మెరిసింది. ఇక అనుష్క నవీన్ శెట్టి సినిమాతో పలకరించగా ప్రస్తుతం ఘాటీ అనే సినిమాలో చేస్తుంది. ఇక తమన్నా ఓదెల రైల్వే స్టేషన్ సినిమా చేస్తోంది.

Exit mobile version