నటుడు, దర్శకుడు అయిన సెల్వరాఘవన్, ఆయన భార్య గీతాంజలి విడిపోతున్నారా అనే చర్చ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. దర్శకుడు కస్తూరి రాజా పెద్ద కుమారుడైన సెల్వరాఘవన్, మొదట నటి సోనియా అగర్వాల్‌ను వివాహం చేసుకున్నారు. కానీ ఆ బంధం కొన్ని సంవత్సరాలకే ముగిసింది. ఆ తర్వాత దర్శకురాలు, నిర్మాత అయిన గీతాంజలిని రెండవ వివాహం చేసుకున్నారు. అయితే, ఇప్పుడు గీతాంజలి చేసిన ఒక పని కారణంగా అభిమానులు, ‘సెల్వరాఘవన్, గీతాంజలి కూడా విడిపోతున్నారా?’ అని ప్రశ్నించుకుంటున్నారు.
Also Read:Tarun Bhaskar – Eesha: పెళ్లి పీటలెక్కనున్న తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా?
సెల్వరాఘవన్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. తరచూ జీవిత సత్యాలను గురించి మాట్లాడే వీడియోలను, అలాగే తన భార్య, పిల్లలతో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటారు. అయితే, తాజాగా సెల్వరాఘవన్ గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోంది. గీతాంజలి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఉన్న సెల్వరాఘవన్‌కు సంబంధించిన ఫొటోలన్నింటినీ తొలగించేశారు. ఈ చర్యతో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోబోతున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే, ఇటీవలి కాలంలో సినీ ప్రముఖులు చాలా మంది సోషల్ మీడియా పోస్ట్‌లను తొలగించడం ద్వారా తాము విడిపోతున్నట్లు పరోక్షంగా ప్రకటిస్తున్నారు. ఇప్పుడు గీతాంజలి కూడా అదే విధంగా చేస్తున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి.
Also Read:Venky Kudumula: నిర్మాతగా మరో దర్శకుడు
సోనియా అగర్వాల్‌తో విడాకుల తర్వాత, సెల్వరాఘవన్ 2011లో గీతాంజలిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మధ్యకాలంలో సెల్వరాఘవన్ ఎక్కువగా దర్శకత్వం చేయకపోయినా, విలన్‌గా, సహాయక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. విలన్, క్యారెక్టర్ రోల్స్‌లో ఆయన నటనకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. నిజానికి ఇలాంటి వార్తలే కొన్ని నెలల క్రితం కూడా సెల్వరాఘవన్ గురించి వినిపించాయి. ఆ సమయంలో సెల్వరాఘవన్ తన భార్యతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసి, ఆ వదంతులకు ముగింపు పలికారు. ఇప్పుడు కూడా, ఈ తాజా వదంతులపై సెల్వరాఘవన్ లేదా గీతాంజలి ఏదైనా స్పష్టత ఇస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారిద్దరూ తమ బంధం గురించి అధికారికంగా వివరణ ఇచ్చే వరకు ఈ ఊహాగానాలకు తెరపడే అవకాశం కనిపించడం లేదు. వారిద్దరూ కలిసి ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
