NTV Telugu Site icon

కథ చెప్పి ఒప్పించలేను.. కానీ చూపించగలను: శేఖర్ కమ్ముల

టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లీడర్, ఫిదా ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన ఆయన తాజాగా లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే (ఏప్రిల్ 16న) విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనుంది చిత్రబృందం. సినిమా వాయిదా పడిన.. ప్రమోషన్ లో మాత్రం మిగితా సినిమాల కంటే ముందే వుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా విషయాల గూర్చి చెప్పుకొచ్చాడు. 

ఈమధ్య ప్రచారం జరిగినట్టుగానే.. ‘ఫిదా’ సినిమా కథని మొదటిసారిగా సూపర్ స్టార్ మహేష్ ​‌బాబుకు చెప్పాడట ఈ దర్శకుడు. ఆ తరువాత రామ్‌ చరణ్‌కి వినిపించాడట.. అయితే ప్రేక్షకులను కదిలించే సున్నితమైన సన్నివేశాలను హీరోలకు డ్రామాటైజ్ చేసి చెప్పటం తనకు రాదన్నాడు. ఉదాహరణగా ‘ఫిదా’ సినిమాలో అక్క అత్తగారింటికి వెళ్తూ చెల్లెకి ఈ మాత్రలు తండ్రికి ఇవ్వాలంటూ చెబుతుంది. కానీ వీరు ఇవ్వకుండానే తండ్రి మాత్రలు వేసుకుంటాడు. ఇది ప్రేక్షకుల్ని కదిలించే సన్నివేశం.. ఇలాంటి సన్నివేశాల్ని చెప్పి హీరో, హీరోయిన్‌ను ఒప్పించలేనన్నారు.. కానీ తెరపై మాత్రం చూపించగలను అంటూ శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు.