శేఖర్ కమ్ముల డైరెక్టర్ చేసిన తొలి పాన్ ఇండియా మూవీ రిలీజై నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఇక శేఖర్ కమ్ములకు రెస్ట్ దొరికినట్టే. ప్రమోషన్ గురించి ఆలోచించాల్సిన పనిలేదు. నిర్మాతగా బిజినెస్ లెక్కలు కూడా సెటిలైపోయాయి.. మరి నెక్ట్స్‌మూవీ ఏంటి?
Also Read:AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో 40 మంది నిందితులు.. మొత్తం లిస్ట్ ఇదే..
ఒక్కో సినిమాకు మూడేళ్లు తీసుకునే శేఖర్ కమ్ముల ఒకేసారి రెండు స్క్రిప్ట్స్ రెడీ చేస్తున్నాడు. 2000 సంవత్సరంలో డాలర్ డ్రీమ్స్‌తో డైరెక్టర్‌గా పరిచయమైన ఈ సెన్సిబుల్ డైరెక్టర్ 25 ఏళ్లల్లో కేవలం 10 సినిమాలే తీశాడు. స్పీడ్ పెంచిన శేఖర్ కమ్ముల మరోసారి గ్యాప్ రాకుండా..జాగ్రత్తపడుతూ.. రెండు కథలు రెడీ చేస్తున్నాడని తెలిసింది. ఇందులో డైరెక్టర్‌కు బాగా కలిసొచ్చిన లవ్ స్టోరీ కూడా వుందట. కుబేర తర్వాత శేఖర్ కమ్ములు నానీతో సినిమా ప్లాన్ చేశాడు. ఆల్రెడీ కథ కూడా వినిపించాడని తెలిసింది.
Also Read:Mega157 : కేరళలో #Mega157 షూటింగ్
అయితే నాని కమిటైన సినిమాలు పూర్తికావడానికి రెండేళ్లు పట్టనుంది. ఈలోగా.. న్యూ ఏజ్డ్ లవ్‌స్టోరీ తీయడానికి రెడీ అవుతున్నాడని తెలిసింది. ఆనంద్.. గోదావరి.. ఫిదా.. లవ్‌స్టోరీతో సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల మరోసారి ప్రేమకథను రాసే పనిలో వున్నాడు. కుబేరతో శేఖర్ కమ్ముల పాన్ ఇండియాలోకి అడుగుపెట్టాడు. నానీ ఎలాగూ పాన్ ఇండియా మూవీస్ తప్ప మరోటి తీయడం లేదు కాబట్టి.. నేచురల్ స్టార్‌తో సినిమా ఆ రేంజ్‌లోనే తీస్తాడు. ఒకవేళ లవ్‌స్టోరీ తీయాల్సి వస్తే..పాన్ ఇండియా లవ్‌స్టోరీ తీస్తాడా?లేదో చూడాలి మరి.