ధనుష్-శేఖర్ కమ్ముల మూవీ: మరో ఇంట్రెస్టింగ్ గాస్సిప్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో త్వరలోనే ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇది తెరకెక్కనుంది. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల, ధనుష్ కలిసి నిర్మించనున్నారు. ధనుష్ తెలుగులో నటించనున్న ఫస్ట్ మూవీ ఇదే. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్, షూటింగ్ వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఇదిలావుంటే, ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి గాసిప్స్ వార్తలు ఎక్కువ అయ్యాయి. హీరోయిన్ ఎంపిక మొదలు, ధనుష్ రెమ్యూనరేషన్ దాకా వరుసగా వార్తలు ప్రచారం అవుతూనే ఉన్నాయి. అయితే ఈసారి ఫీల్ గుడ్ చిత్రాలతో ప్రేక్షకుల మనసులు దోచుకునే శేఖర్ కమ్ములపై పడింది. ఈ చిత్ర కథ పొలిటికల్ నేపథ్యంలో సాగనుందని తెలుస్తోంది. శేఖర్ చెప్పిన కథకు ధనుష్ ఇంప్రెస్స్ అయ్యే ప్రాజెక్ట్ కు కమిట్ అయ్యాడని తెలుస్తోంది. తమిళనాడు రాజకీయాలతో ముడిపడిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా కథను సిద్ధంచేసాడని సమాచారం. అయితే శేఖర్ కమ్ముల గతంలోనూ రానా దగ్గుబాటితో లీడర్ సినిమా చేసి మెప్పించిన విషయం తెలిసిందే. అయితే మరోసారి ఈ దర్శకుడు పొలిటికల్ టచ్ లో సినిమా చేస్తాడో, లేదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే!
Also Read
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బెంచ్‌కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్‌కు ఎందుకు ఛాన్స్ లేదు?
-
Cinema News: థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్‌లో చరిత్ర సృష్టించిన బెల్లంకొండ సినిమా!
-
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
-
Jai Moondra: రెండు మ్యాచ్‌లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!