Secret Soldier : సెన్సార్ బోర్డులో 8 నెలలు.. హోమ్ మినిస్ట్రీకి వెళ్లిన ‘సీక్రెట్ సోల్జర్’

Secret Soldier

Secret Soldier

చిన్న సినిమాగా మొదలై ‘సీక్రెట్ సోల్జర్’ ఏకంగా సెన్సార్ బోర్డు కారణంగా సెంట్రల్ హోం మినిస్ట్రీ దాకా వెళ్ళింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ఎనిమిది నెలల పాటు సెన్సార్ బోర్డు చుట్టూ తిరగడం, ఏకంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దాకా ఈ సినిమా ఫైల్ వెళ్లడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై డ్రామా వెనుక ఉన్న కష్టం అంతా ఇంతా కాదు. ఇక ట్రైలర్ లాంచ్ లో తమ సినిమాను చిన్నచూపు చూస్తున్న వారికి హీరో నిహాల్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. “ఇది చిన్న సినిమా కాదు.. ఈ ఏడాది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌ పరిశీలనకు వెళ్లిన ఫైల్స్ లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమా, భారీ యాక్షన్ చిత్రం ‘దురంధర్’ తో పాటు మూడోది మా ‘సీక్రెట్ సోల్జర్’ మాత్రమే” అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

కంటెంట్, అందులో టచ్ చేసిన సెన్సిటివ్ ఇష్యూస్ వల్లే ఈ సినిమాకు సెన్సార్ కష్టాలు వచ్చాయని ప్రముఖ రైటర్, డైరెక్టర్ బి.వి.ఎస్ రవి కూడా ధృవీకరించారు. ఏకంగా 8 నెలల పాటు ఈ సినిమా సెన్సార్ ఆఫీస్‌లో లాక్ అయిపోయిందని, ఫైనల్ గా నిర్మాత ప్యాషన్ వల్లే బయటకు వచ్చిందని ఆయన వెల్లడించారు. ఇక ఈవెంట్ లో హీరో నిహాల్ చేసిన కామెంట్స్ నవ్వులు పూయించడంతో పాటు అతని కాన్ఫిడెన్స్ రేంజ్ ని చూపించాయి. సినిమా భారీ హిట్ కొడుతుందని, సక్సెస్ అయితే రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు పెద్ద పార్టీ ఇస్తానని ఛాలెంజ్ చేశాడు. ఒకవేళ రిజల్ట్ తేడా కొడితే మాత్రం, పంజాగుట్ట సెంటర్లో ఆటో ఎక్కి సైలెంట్ గా ఇంటికెళ్లిపోయి రెండు రోజులు ఏడ్చేసి.. ఆ తర్వాత మరో సినిమా పనిలో పడిపోతానని సరదాగా చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 18న థియేటర్లలోకి వస్తోంది. కార్తీక్ రోడ్రిగ్జ్ సంగీతం అందించగా, సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. మరి హోమ్ మినిస్ట్రీ దాకా వెళ్లి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ ‘సీక్రెట్ సోల్జర్’ బిగ్ స్క్రీన్ పై ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.