NTV Telugu Site icon

అంజలి ఈ సారైనా నిలదొక్కుకుంటుందా!?

తెలుగమ్మాయి అంజలి ‘వకీల్ సాబ్’తో నిలదొక్కుకున్నట్లేనా!? గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో ఓ వేవ్ లా టాలీవుడ్ ని తాకింది అంజలి. అంతకు ముందు చిన్న చిన్న సినిమాల్లో నటించినా… ఆ సినిమా ఒక్కసారిగా స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది. అప్పటికే తమిళనాట కూడా స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది అంజలి. అయితే వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులతో కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా కొనసాగించలేక పోయింది. మధ్యలో కొన్ని సినిమాల్లో మెరిసినా మునుపటి ఫామ్ అందిపుచ్చుకోలేక పోయింది. తాజాగా పవన్ కళ్యాణ్‌ ‘వకీల్ సాబ్’లో కీలక పాత్రలో మెరిసింది. గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’లో అవకాశం ఇచ్చిన దిల్ రాజే మరోసారి అంజలికి ‘వకీల్ సాబ్’లో కీలక పాత్ర ఇచ్చి ప్రోత్సహించారు. గతంలో కంటే స్లిమ్ గా తయారైన అంజలి తన నటనతో ఆకట్టుకుంది కూడా. దీంతో దిల్ రాజు అనిల్ రావిపూడితో తీస్తున్న ‘ఎఫ్‌3’లో మరో ముఖ్య పాత్ర ఆఫర్ చేశారట. సోనాల్ చౌహాన్ పోషించాల్సిన ఆ పాత్రను అంజలితో రీప్లేస్ చేస్తున్నారట. ‘వకీల్ సాబ్’ తర్వాతే ఈ మార్పు జరగటం విశేషం. ఈ సినిమాలో నటించటానికి అంజలి మైసూర్ వెళ్ళింది. ప్రస్తుతం అక్కడే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. సో వకీల్ సాబ్ తో అంజలి ఫ్రెష్‌ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిందన్న మాట. మరి ఈ సారైనా అంజలి హీరోయిన్ గా నిలదొక్కుకుంటుందేమో చూద్దాం.