అంజలి ఈ సారైనా నిలదొక్కుకుంటుందా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగమ్మాయి అంజలి ‘వకీల్ సాబ్’తో నిలదొక్కుకున్నట్లేనా!? గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో ఓ వేవ్ లా టాలీవుడ్ ని తాకింది అంజలి. అంతకు ముందు చిన్న చిన్న సినిమాల్లో నటించినా… ఆ సినిమా ఒక్కసారిగా స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది. అప్పటికే తమిళనాట కూడా స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది అంజలి. అయితే వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులతో కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా కొనసాగించలేక పోయింది. మధ్యలో కొన్ని సినిమాల్లో మెరిసినా మునుపటి ఫామ్ అందిపుచ్చుకోలేక పోయింది. తాజాగా పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’లో కీలక పాత్రలో మెరిసింది. గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’లో అవకాశం ఇచ్చిన దిల్ రాజే మరోసారి అంజలికి ‘వకీల్ సాబ్’లో కీలక పాత్ర ఇచ్చి ప్రోత్సహించారు. గతంలో కంటే స్లిమ్ గా తయారైన అంజలి తన నటనతో ఆకట్టుకుంది కూడా. దీంతో దిల్ రాజు అనిల్ రావిపూడితో తీస్తున్న ‘ఎఫ్3’లో మరో ముఖ్య పాత్ర ఆఫర్ చేశారట. సోనాల్ చౌహాన్ పోషించాల్సిన ఆ పాత్రను అంజలితో రీప్లేస్ చేస్తున్నారట. ‘వకీల్ సాబ్’ తర్వాతే ఈ మార్పు జరగటం విశేషం. ఈ సినిమాలో నటించటానికి అంజలి మైసూర్ వెళ్ళింది. ప్రస్తుతం అక్కడే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. సో వకీల్ సాబ్ తో అంజలి ఫ్రెష్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిందన్న మాట. మరి ఈ సారైనా అంజలి హీరోయిన్ గా నిలదొక్కుకుంటుందేమో చూద్దాం.
Also Read
- Kollywood : రూట్ మార్చిన కోలీవుడ్ స్టార్స్.. మళ్లీ కమర్షియల్ జోన్లోకి సూర్య, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్!
- Peddi Inside Talk : 'పెద్ది' ఇన్ సైడ్ రిపోర్ట్.. ఫస్టాఫ్ అదిరింది..సెకండాఫ్ కొంచం?
- Peddi Breakeven Target : రామ్ చరణ్ 'పెద్ది' ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
- Blast Zone : అంచనాలు లేకుండా వచ్చి అదరగొట్టిన యాక్షన్ కింగ్ అర్జున్ 'బ్లాస్ట్'
తాజావార్తలు
-
Pawan Kalyan: ప్రెస్‌మీట్‌కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
-
Hellfire Missile Explained: అమెరికా సీక్రెట్ వెపన్.. టార్గెట్ ఫిక్స్ చేసి కొడితే శత్రు నౌకల గుండెలు పేలాల్సిందే!
-
Airtel: రూ.99కే ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం.. 20కి పైగా OTT యాప్‌లకు యాక్సెస్
-
Venkatesh Iyer: ట్రోలింగ్ నన్ను ప్రభావితం చేసింది.. ఆ మ్యాచ్ నా కెరీర్లో కీలక మలుపు!
-
Kollywood : రూట్ మార్చిన కోలీవుడ్ స్టార్స్.. మళ్లీ కమర్షియల్ జోన్లోకి సూర్య, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!