రాజోలు చిన్నది, అచ్చతెలుగు అమ్మాయి అంజలి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఈ నెల 1వ తేదీకి పదిహేను సంవత్సరాలు పూర్తయ్యింది. శివనాగేశ్వరరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘ఫోటో’ సినిమా పదిహేనేళ్ల క్రితం అంటే 2006 సెప్టెంబర్ 1న విడుదలైంది. ఈ సందర్భంగా ఈ పదిహేనేళ్ళలో అంజలి వివిధ చిత్రాలలోని పోషించిన పాత్రలతో ఓ పోస్టర్ ను చేశారు. దీనిని అంజలి ఆదివారం ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దానితో పాటే… ‘నాకు తెలుసు, నేను పార్టీకి ఆలస్యంగా వచ్చానని,…
టాలీవుడ్ హీరోయిన్ అంజలి రీసెంట్ గా నటించిన చిత్రం ‘వకీల్‌సాబ్’. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అంజలి ఓ కీలక పాత్రలో కనిపించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. నివేదా థామస్, అనన్య, ప్రకాశ్‌రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకి వస్తున్న ఆదరణ పట్ల నటి అంజలి ఆనందం వ్యక్తం చేసింది. ‘వకీల్‌సాబ్ నేను ఎప్పటికీ గర్వంగా చెప్పుకునే సినిమా. నా కెరీర్ లో ఓ మైలురాయిలా…
తెలుగమ్మాయి అంజలి ‘వకీల్ సాబ్’తో నిలదొక్కుకున్నట్లేనా!? గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో ఓ వేవ్ లా టాలీవుడ్ ని తాకింది అంజలి. అంతకు ముందు చిన్న చిన్న సినిమాల్లో నటించినా… ఆ సినిమా ఒక్కసారిగా స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది. అప్పటికే తమిళనాట కూడా స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది అంజలి. అయితే వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులతో కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా కొనసాగించలేక పోయింది. మధ్యలో కొన్ని సినిమాల్లో మెరిసినా మునుపటి ఫామ్ అందిపుచ్చుకోలేక…