Satyanarayana with SVR: యస్వీఆర్ తో సత్యనారాయణ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satyanarayana with SVR: యన్టీఆర్ అన్నగా అభిమానించే సత్యనారాయణ, యస్వీ రంగారావును తండ్రిగా ఆరాధించేవారు. తొలి రోజుల్లో యస్వీఆర్ తోకలసి సత్యనారాయణ నటించిన పలు చిత్రాలలో ఆయన నుండి ఏ సన్నివేశంలో ఏ డైలాగ్ ఎలా పలకాలో నేర్చుకున్నానని సత్యనారాయణ చెప్పేవారు. బాపు తెరకెక్కించిన మహత్తర పౌరాణిక చిత్రం `సంపూర్ణ రామాయణం`లో యస్వీ రంగారావు రావణాసురునిగా నటించగా, ఆయన కొడుకు ఇంద్రజిత్ పాత్రలో సత్యనారాయణ అభినయించారు. ఈ సినిమా సమయంలోనూ సత్యనారాయణకు సంభాషణలు ఎలా పలకాలో యస్వీఆర్ దగ్గరుండి మరీ ఓకొడుకుకు తండ్రి నేర్పించినట్టుగా నేర్పారట.
Read also: Satyanarayana in Hindi: హిందీలో సత్యనారాయణ!
Also Read
- Raima Islam Shimu: భర్తతో గొడవ నుంచి హత్య వరకు.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి నటి కేసు
- IRUMUDI : టికెట్ల అమ్మకాల్లో పెద్దిని దాటిన 'ఇరుముడి'
- Shivalayam Movie: రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్ హీరోగా ‘శివాలయం’ మూవీ!
- Miss Universe India 2026:19 ఏళ్ల కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. అంతర్జాతీయ వేదికపై కూడా బరిలోకి!
ఆ తరువాత `దేవుడు చేసిన మనుషులు`లో ఓ సన్నివేశంలో తాగుబోతులా యస్వీఆర్ ముందు నటించడం భలేగా నవ్వు పుట్టించిందట. దాంతో యస్వీఆర్ మందలించి, మనం కాదు, పాత్ర కనిపించాలి అంటూ బోధించారని అదే ఆ తరువాత రోజుల్లో తాను ఫాలో అయ్యానని సత్యనారాయణ చెప్పేవారు. ఇక దాసరి నారాయణ రావు తొలి చిత్రం `తాత-మనవడు`లో కూడా యస్వీరంగారావు తనయునిగానే సత్యనారాయణ నటించి మెప్పించారు. `డబ్బుకు లోకం దాసోహం`లో యస్వీఆర్, సత్యనారాయణ అన్నదమ్ములుగానూ తమదైన అభినయం ప్రదర్శించారు. అలా యస్వీరంగారావుతోనూ తన అనుబంధం ప్రత్యేకమైనదేనని సత్యనారాయణ తరచూ గుర్తు చేసుకొనేవారు.
తాజావార్తలు
-
TPCC: సీఎం రేవంత్‌రెడ్డితో మల్లు రవి భేటీ.. కొండా సురేఖ ఎపిసోడ్‌పై మీనాక్షి నటరాజన్, పీసీసీకి నివేదిక..
-
Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
-
Minister Anitha: హోంమంత్రి అనితకు స్వల్ప గాయం!
-
Sangareddy: ప్రియుడి మోజులో కన్న తల్లిదండ్రులను చంపిన యువతి.. అదే మత్తు ఇంజెక్షన్‌తో తానూ ఆత్మహత్య
-
Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..