Satya raj: ప్రమోషన్స్ లో జోరు పెంచిన సత్యరాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్‌గా కట్టప్ప పాత్రలో సత్యరాజ్ అందరినీ అలరించారు. సౌత్‌లో సత్యరాజ్ హీరోగా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా వందల చిత్రాల్లో నటించారు. ఇప్పటికీ సత్యరాజ్ చేతి నిండా ప్రాజెక్టులతో కుర్ర హీరోలకు పోటీ అనేట్టుగా పని చేస్తున్నారు. సినిమాని ప్రమోట్ చేయడంలోనూ కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారు సత్యరాజ్. సత్యరాజ్ ప్రముఖ పాత్రలో నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్ రెడ్డి అడిదాల నిర్మించిన ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టీం బిజీగా ఉంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ అలరించింది. పాటలు, టీజర్, గ్లింప్స్ ఇలా ప్రతీ ఒక్కటీ ఆడియెన్స్‌లో సినిమా పట్ల ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ట్రెండ్‌ను ఫాలో అయ్యారు సత్యరాజ్.
‘అనగా అనగా కథలా’ అనే పాట ఈ మధ్య రిలీజ్ అయి యూట్యూబ్‌లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాత, మనవరాలి మధ్య ఉండే బాండింగ్‌ను చూపించేలా ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాట ప్రమోషన్స్‌లో భాగంగా సత్యరాజ్ రీల్స్ చేశారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో హీరోయిన్లంతా కూడా రీల్స్ చేస్తుండగా.. సత్యరాజ్ సైతం ఈ ట్రెండ్‌లో పాల్గొన్నారు. త్రిబాణధారి బార్బరిక్ సినిమాను తనదైన శైలిలో ప్రమోట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ వంటి వారు నటించారు. ఇక త్వరలోనే మేకర్లు రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
Also Read
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!