Satya : పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ గెల్చుకున్న సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్
- గ్రాండ్ గా ఫిలింఫేర్ షార్ట్ ఫిలిం అవార్డ్స్
- పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ గెల్చుకున్న సుప్రీమ్ హీరో
- సాయిదుర్గ తేజ్, స్వాతి రెడ్డి కాంబోలో వచ్చిన "సత్య"
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డుల వేడుక ఆదివారం రాత్రి ముంబయిలో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు హాజరయ్యారు. వివిధ కారణాల వలన నేరుగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌లలో అద్భుత నటన ప్రదర్శించిన నటీనటులు, టెక్నిషియన్స్ కు ఈ అవార్డులను ప్రకటించారు. సినిమా విభాగంలో ఉత్తమ నటిగా బాలీవుడ్ భామ కరీనా కపూర్, ఉత్తమ నటుడిగా దిల్జిత్ దొసాంజ్ అవార్డు గెలుచుకోగా, ఉత్తమ సిరీస్ గా రైల్వేమెన్ అవార్డు గెలుచుకుంది.
Also Read : Filmfare OTT Awards 2024: ఫిలింఫేర్ 2024 ఓటీటీ అవార్డ్స్ విజేతల లిస్ట్ ఇదే
Also Read
ఈ వేడుకలోనే టాలీవుడ్ నటుడు సాయిదుర్గా తేజ్, స్వాతి నటించిన షార్ట్ ఫిల్మ్ ‘సత్య’ అవార్డు గెలుచుకుంది. హార్ట్ టచింగ్ షార్ట్ ఫిలింగా అందరి ప్రశంసలు పొందింది సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ నటించిన “సత్య”. ఈ షార్ట్ ఫిలిం ఫిలింఫేర్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ 2024లో పీపుల్స్ ఛాయిస్ కేటగిరిలో అవార్డు గెల్చుకుంది. ఈ అవార్డు గెల్చుకున్న హ్యాపీ మూవ్ మెంట్ ను టీమ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ‘ సత్య ప్రజల కోసం రూపొందించబడిన ఒక అందమైన కథ, ఫిలింఫేర్ పీపుల్స్ ఛాయిస్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ 2024 అవార్డుతో ప్రజలచే రివార్డ్ చేయబడింది. నలుగురు స్నేహితులను కలిసి మొదలు పెట్టిన ఈ ప్రయాణం జీవితాంతం నిలిచిపోయే జ్ఞాపకాలను అందించింది, అందరికి ధన్యవాదాలు’ అని ట్వీట్ చేసాడు సాయి. “సత్య” షార్ట్ ఫిలింలో స్వాతి రెడ్డి హీరోయిన్ గా నటించింది. హర్షిత్, హన్షిత నిర్మాతలుగా వ్యవహరించారు. విజయకృష్ణ వీకే దర్శకత్వం వహించారు. మ్యూజికల్ షార్ట్ ఫిలింగా “సత్య” ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చింది.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్‌కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!