NTV Telugu Site icon

Satya : పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ గెల్చుకున్న సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్

Satys

Satys

2024 ఫిల్మ్‌ఫేర్‌ ఓటీటీ అవార్డుల వేడుక ఆదివారం రాత్రి  ముంబయిలో గ్రాండ్  గా జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు హాజరయ్యారు. వివిధ కారణాల వలన  నేరుగా ఓటీటీలో విడుదలైన సినిమాలు,  వెబ్ సిరీస్‌లలో అద్భుత నటన ప్రదర్శించిన నటీనటులు, టెక్నిషియన్స్ కు  ఈ అవార్డులను ప్రకటించారు. సినిమా విభాగంలో ఉత్తమ నటిగా బాలీవుడ్ భామ కరీనా కపూర్‌, ఉత్తమ నటుడిగా దిల్జిత్‌ దొసాంజ్‌ అవార్డు గెలుచుకోగా, ఉత్తమ సిరీస్ గా రైల్వేమెన్ అవార్డు గెలుచుకుంది.

Also Read : Filmfare OTT Awards 2024: ఫిలింఫేర్‌ 2024 ఓటీటీ అవార్డ్స్ విజేతల లిస్ట్ ఇదే

ఈ వేడుకలోనే టాలీవుడ్ నటుడు సాయిదుర్గా తేజ్‌, స్వాతి నటించిన షార్ట్‌ ఫిల్మ్‌ ‘సత్య’ అవార్డు గెలుచుకుంది. హార్ట్ టచింగ్ షార్ట్ ఫిలింగా అందరి ప్రశంసలు పొందింది సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ నటించిన “సత్య”. ఈ షార్ట్ ఫిలిం ఫిలింఫేర్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ 2024లో పీపుల్స్ ఛాయిస్ కేటగిరిలో అవార్డు గెల్చుకుంది. ఈ అవార్డు గెల్చుకున్న హ్యాపీ మూవ్ మెంట్ ను టీమ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ‘ సత్య ప్రజల కోసం రూపొందించబడిన ఒక అందమైన కథ, ఫిలింఫేర్ పీపుల్స్ ఛాయిస్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ 2024 అవార్డుతో ప్రజలచే రివార్డ్ చేయబడింది. నలుగురు స్నేహితులను కలిసి మొదలు పెట్టిన ఈ ప్రయాణం జీవితాంతం నిలిచిపోయే జ్ఞాపకాలను అందించింది, అందరికి ధన్యవాదాలు’ అని ట్వీట్ చేసాడు సాయి. “సత్య” షార్ట్ ఫిలింలో స్వాతి రెడ్డి హీరోయిన్ గా నటించింది. హర్షిత్, హన్షిత నిర్మాతలుగా వ్యవహరించారు. విజయకృష్ణ వీకే దర్శకత్వం వహించారు. మ్యూజికల్ షార్ట్ ఫిలింగా “సత్య” ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చింది.

Show comments