Sardar2 : కార్తీ ‘సర్దార్ -2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈసారి యాక్షన్ డబుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ కార్తీ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో గతంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘సర్దార్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా చాలా కాలంగా షూటింగ్ దశలోనే ఉంది. కార్తీ ఇతర సినిమాల కారణంగా ఈ సినిమా కాస్త ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. భారీ బడ్జెట్, హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 10, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
ప్రస్తుతం ఈ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కార్తీ మార్కెట్ రేంజ్‌ను మరింత పెంచేలా ఈ స్పై థ్రిల్లర్‌ను తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. జూన్ నెలలో షూటింగ్ ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి ఆన్ టైమ్ కి రిలీజ్ చేసేలా పక్కా ప్లానింగ్ రెడీ చేస్తోంది యూనిట్. ఈ చిత్రంలో కార్తీ మరోసారి పవర్ఫుల్ ‘ఏజెంట్ సర్దార్’ పాత్రలో మెస్మరైజ్ చేయనున్నారు. ‘మిషన్ ఆఫ్ ఎ లైఫ్ టైమ్’ అనే ట్యాగ్‌లైన్‌తో రాబోతున్న ఈ సినిమా మొదటి భాగం కంటే రెట్టింపు యాక్షన్, ఇంటెన్స్ డ్రామా మరియు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఉండబోతుందని సమాచారం. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య విలన్‌గా నటిస్తుండగా, మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్యామ్ సి.ఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
Also Read
- Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మండాడి’..
- Kartikeya Gummakonda : తన 'కమ్‌బ్యాక్' కోసం మెగాఫోన్ పట్టిన 'ఆర్ఎక్స్ 100' హీరో..
- Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
తాజావార్తలు
-
YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
-
Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మండాడి’..
-
AP JUDA: స్టైపెండ్ పెంపుపై జూడాల అసంతృప్తి.. ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!