SJ Suryah: భైరవుడిని మించిన విలనిజం.. సర్దార్ 2 లో SJ సూర్య ‘బ్లాక్ డాగర్’పై భారీ హైప్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SJ Suryah: కార్తి హీరోగా తెరకెక్కుతున్న క్రేజీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఫస్ట్ పార్ట్ ‘సర్దార్’కు సీక్వెల్‌గా డైరెక్టర్ పీఎస్ మిత్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమాలో విలన్‌గా నటిస్తున్న SJ సూర్య తన పాత్ర గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ‘సర్దార్ 2’లో తాను ‘బ్లాక్ డాగర్’ అనే పాత్రలో కనిపించనున్నట్లు SJ సూర్య ఇప్పటికే వెల్లడించారు. తాజాగా ఈ క్యారెక్టర్‌పై ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘స్పైడర్’లో తాను పోషించిన భైరవుడు పాత్రకు ‘సర్దార్ 2’లోని బ్లాక్ డాగర్ క్యారెక్టర్ ఒక ఎక్స్‌టెన్షన్‌లా ఉంటుందని, నెక్స్ట్ లెవల్లో ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం SJ సూర్య చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ సినిమాలో ఆయన విలనిజం ఏ స్థాయిలో ఉండబోతోందనే ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత పెరిగింది.
‘సర్దార్ 2’లో కార్తి రెండు విభిన్న షేడ్స్‌లో కనిపించనున్నారు. ముఖ్యంగా ఓల్డ్ మ్యాన్ గెటప్‌లో కార్తి చేసే యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చిత్రబృందం చెబుతోంది. ఈ నేపథ్యంలో కార్తికి ధీటుగా SJ సూర్య పోషిస్తున్న బ్లాక్ డాగర్ పాత్రను దర్శకుడు పీఎస్ మిత్రన్ డిజైన్ చేసినట్లు సమాచారం. ఫస్ట్ పార్ట్‌లో వాటర్ మాఫియా అంశాన్ని చూపించిన మిత్రన్.. సీక్వెల్లో దేశానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన సమస్యను స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించినట్లు ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కార్తి తెలిపారు. ఇండియాలోనే జరిగే కథతో ఈ సినిమా సాగుతుందని, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ అనుభూతిని ఇస్తాయని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన 'హాయ్'!
- TV Nandi Awards: తిరుపతి వేదికగా 'నంది' అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
- Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు స్పై ఎలిమెంట్స్‌కు పెద్దపీట వేసినట్లు ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రచార చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఏకంగా వందే భారత్ ట్రైన్ సెట్‌ను నిర్మించి కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు కార్తి వెల్లడించారు. ఈ సినిమాలో ఆశిక రంగనాథన్, మాళవిక మోహనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్లకు భిన్నంగా వారి పాత్రలను స్ట్రాంగ్, ఇంటెలిజెంట్‌గా డిజైన్ చేసినట్లు సమాచారం. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తోంది. సెప్టెంబర్ 10న థియేటర్లలోకి రానున్న ‘సర్దార్ 2’లో కార్తి వర్సెస్ SJ సూర్య మధ్య పోరు ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
CBSE Gets New Chairman: CBSEకి కొత్త ఛైర్మన్.. ఎవరీ మందీప్ భండారీ?.. పూర్తి వివరాలు ఇవే
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
AFSPA Extension: మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో.. AFSPA మరో ఆరు నెలలు పొడిగింపు
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!