Site icon NTV Telugu

Sardar 2 : కార్తీ బర్త్ డే స్పెషల్.. ‘స‌ర్ధార్ 2’ నుండి పవర్ ఫల్ పోస్టర్ రిలీజ్

Karhi

Karhi

కొలీవుడ్ టూ టాలీవుడ్ లో మంచి స్టార్‌డమ్ సంపాదించుకున్న హీరో కార్తీ. ‘యుగానికి ఒక్కడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత ‘ఆవారా’, ‘నా పేరు శివ’, ‘ఖాకీ’, ‘ఖైదీ’, ‘పొన్నియన్ సెల్వన్’ వంటి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అయితే కార్తీ నటించిన బ్లాక్ బస్టర్ హిట్స్‌లో ‘సర్దార్’ ఒక‌టి. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమాకు మూవీ టీం సీక్వెల్‌ను కూడా ప్రక‌టించిన విష‌యం తెలిసిందే.

Also Read : ‘Lenin’ : అఖిల్ ఎంట్రీ సీక్వెన్స్ కోసం స్పెషల్ సెట్ !

సిక్వెల్ కి కూడా పీఎస్ మిత్రన్ ద‌ర్శక‌త్వం వహిస్తుండగా.. ఈ సినిమా ప్రస్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇందులో స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలో నటించబోతున్నారు అయితే..తాజాగా నేడు కార్తీ పుట్టిన‌రోజు కావ‌డంతో ఆయన‌కు బ‌ర్త్‌డే విషెస్ తెలుపుతూ.. కొత్త పోస్టర్ను పంచుకుంది టీమ్. ఈ పోస్టర్ లో కార్తి ఊహించని పవర్ ఫుల్ లుక్ లో కనిపించాడు. గడ్డం.. చెతిలో గన్ పట్టుకుని గ్యాగ్‌స్టర్‌గా కనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ వైర‌ల్‌గా మారింది.

 

Exit mobile version