Site icon NTV Telugu

Sara Arjun: ‘ధురంధర్’ బ్యూటీకి బంపర్ ఆఫర్.. లెజెండరీ నటి బయోపిక్‌లో ఛాన్స్!

Sara Arjun Madhubala

Sara Arjun Madhubala

భారతీయ వెండితెర దిగ్గజం మధుబాల జీవిత చరిత్ర త్వరలో వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌లో మధుబాల పాత్రను పోషించే అరుదైన అవకాశాన్ని యువ నటి సారా అర్జున్ దక్కించుకుంది. ఇటీవల వచ్చిన ‘ధురంధర్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సారా.. ఇప్పుడు ఈ ఐకానిక్ పాత్రతో తన కెరీర్‌లో మరో మెట్టు ఎక్కబోతోంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తుండటం విశేషం. ‘డార్లింగ్స్’ సినిమాతో తన ప్రతిభను చాటుకున్న జస్మీత్ కె. రీన్ ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహించనున్నారు. భన్సాలీ చిత్రాలంటేనే ఉండే ఆ లార్జర్ ద్యాన్ లైఫ్ మేకింగ్ ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

సారా అర్జున్ ప్రయాణం అత్యంత స్ఫూర్తిదాయకం. చిన్న వయసులోనే టీవీ ప్రకటనలతో కెరీర్ ప్రారంభించిన సారా.. ఆరేళ్ల వయసులో చియాన్ విక్రమ్ సరసన ‘నాన్న’ చిత్రంలో బాలనటిగా నటించి అందరి హృదయాలను గెలుచుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఆమె.. ఇటీవల హీరోయిన్‌గా ‘ధురంధర్’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంది. మధుబాల బయోపిక్ కోసం తొలుత పరిశ్రమలోని పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లను చిత్ర బృందం పరిశీలించింది. అయితే మధుబాలలోని ఆ అమాయకత్వం, తీక్షణతను ప్రతిబింబించడంలో సారా అయితేనే పూర్తి న్యాయం చేయగలదని నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ భావించారని తెలుస్తోంది. సారా స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాత్రకు ప్రధాన బలం కానుంది.

Also Read: Allu Arjun Remuneration: ఇండియన్ సినిమాలో సరికొత్త రికార్డు.. ‘రాకా’ కోసం అల్లు అర్జున్ అన్ని కోట్లు తీసుకుంటున్నారా?

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈ ఏడాది చివరలో సినిమా షూటింగ్ పట్టాలెక్కనుంది. ‘ధురంధర్’లో తన నటనతో మెప్పించిన సారా అర్జున్.. ఇప్పుడు లెజెండరీ నటి మధుబాలగా ఎలా మెప్పిస్తుందో చూడాలని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది.

Exit mobile version