కన్నడ నుంచి టాలీవుడ్‌కి అందాల భామలు వరుసగా ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. సౌందర్య తర్వాత ఆ ట్రెండ్ తగ్గలేదు. నటనతో, గ్లామర్‌తో ఆకట్టుకుంటూ ఇక్కడ తమ సత్తా చాటుతున్నారు. రష్మిక మందన్న ఈ తరహాలో ముందంజలో ఉండగా, పలు కొత్త హీరోయిలు కూడా టాలీవుడ్‌కి అడుగుపెడుతున్నారు. ఇటీవలి కాలంలో కన్నడ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాలు వస్తుండటంతో, ఆ చిత్రాల్లో నటించిన హీరోయిన్లకు మిగతా భాషల నుంచి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా ‘కాంతార’ ద్వారా సప్తమీ గౌడ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
Also Read : Kingdom: ‘కింగ్డమ్’ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్..
అయితే ‘కాంతార’ లాంటి హిట్ అందుకున్న తర్వాత ఏ హీరోయిన్ అయినా వరుస సినిమాలతో ధూసుకుపోతారు కానీ.. సప్తమీ మాత్రం ‘కాంతార’ తర్వాత ఎక్కువ సినిమాల్లో కనిపించలేదు. అయితే దీనికి స్పష్టమైన కారణం ఉన్నట్లు చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ ‘కాంతార’ తర్వాత అదే తరహా పాత్రలు నా ముందుకు వచ్చాయి. రొటీన్‌గా అవే పాత్రలు చేయడం ఇష్టం లేక మంచి పాత్రల కోసం వెయిట్ చేశాను. ముక్కు పుడకలు పెట్టుకోవడం.. గ్రామీణ యువతిగా కనిపించడం.. డైలాగ్స్ లేకపోవడం, సినిమాలో క్యారెక్టర్ సరిగా లేకపోవడం వల్ల నేను సినిమాలు ఒప్పుకోలేదు. మంచి పాత్రల కోసం వెయిట్ చేయడం వల్ల ఎక్కువ సినిమాల్లో నటించలేకపోయాను. మిగతా హీరోయిన్లతో నాకు స్క్రీన్ స్పేస్ లేదు.. ప్రజంట్ తెలుగులో మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాను. మరిన్ని అవకాశాలు వస్తాయని నమ్ముతున్న. పుష్ప మూవీలో రష్మిక మందన్నకు దక్కిన రోల్స్ వస్తే బాగుంటుందని వెయిట్ చేస్తున్నా’ అని చెప్పారు.