Santosh Sobhan Movie Break: సినిమాలకు బ్రేక్.. అసలు నిజం బయటపెట్టిన సంతోష్ శోభన్!

  • కొంతకాలంగా వెండితెరకు దూరంగా సంతోష్ శోభన్
  • అసలు నిజం బయటపెట్టిన సంతోష్
  • హీరోగా అవకాశం దొరకడమే గ్రేట్
Santosh Sobhan Movie Break

Santosh Sobhan Movie Break

తెలుగు చిత్రపరిశ్రమలో యువ హీరోలుగా అన్నదమ్ములు సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉండే సంతోష్.. గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నాడు. ఆయన సినిమాలకు ఎందుకు బ్రేక్ ఇచ్చారనే విషయంపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రమోషన్‌లో భాగంగా సంతోష్ ఈ విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ్ముడు సంగీత్ బాగా డబ్బులు సంపాదించడం కారణంగానే తాను చాలా రిలాక్స్ అయ్యాయని సరదాగా చెప్పాడు.

సినిమాలకు మీరు ఇంత గ్యాప్ ఇవ్వడానికి కారణం ఏంటి? అని రిపోర్టర్ అడగ్గా… ‘గ్యాప్ లేకుండా సినిమాలు చేయాల్సిన అవసరం ఉంది. సంగీత్ శోభన్ కారణంగా ఈసారి గ్యాప్ కుదిరింది. సంగీత్ బాగా డబ్బులు సంపాదించడం వల్ల నాకు కాస్త రిలాక్స్ అయ్యే సమయం దొరికింది. నేను, సంగీత్ చిన్నటినుంచి డబ్బుల కోసం చాలా కష్టపడ్డాం. సినిమా ఇండస్ట్రీలో హీరోగా అవకాశం దొరకడమే గ్రేట్. నేను రెండేళ్లు బ్రేక్ తీసుకున్నానంటే.. ఇదొక అదృష్టం. నా తమ్ముడు లేకుంటే నేను ఈ బ్రేక్ తీసుకునే వాడిని కాదు. థాంక్స్ సంగీత్. బ్రేక్ సమయంలో ఓ మంచి కథ చేయాలనుకున్నాను. అది ఈ కపుల్‌ ఫ్రెండ్లీ సినిమానే’ అని సంతోష్ శోభన్ క్లారిటీ ఇచ్చాడు.

Also Read: Pakistan Cricket: ఐసీసీకి పోటీగా కొత్త క్రికెట్ బోర్డు.. పీసీబీ ప్రయత్నం ఆదిలోనే ఫెయిల్?

సంతోశ్‌ శోభన్‌, మానస వారణాసి జంటగా నటించిన సినిమా కపుల్‌ ఫ్రెండ్లీ. అశ్విన్‌ చంద్రశేఖర్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ కపుల్‌ ఫ్రెండ్లీ రిలీజ్ అవుతోంది. లివింగ్‌ టుగెదర్‌ కథాంశంగా ఈ చిత్రం తెరకెక్కింది. చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో కామెడీకి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈరోజు కపుల్‌ ఫ్రెండ్లీ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.