Mohabbat: ఆకట్టుకుంటున్న జెన్-జీ లవ్ స్టోరీ ఫస్ట్ లుక్!

Mohabbat

Mohabbat

ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న సరికొత్త పాన్-ఇండియా చిత్రం *‘మొహబ్బత్’. సంతోష్ కల్వచెర్ల, శ్రేయాసి సేన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక శుక్రవారం నాడు హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ సినిమా పూజా కార్యక్రమాలకు చిన్న శ్రీశైలం యాదవ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు బ్లెస్సింగ్స్ అందించారు. ముహూర్తపు సన్నివేశానికి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ క్లాప్ కొట్టగా, చిత్ర నిర్మాత అఫ్రోజ్ షేక్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం నవీన్ యాదవ్ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా లాంచ్ చేశారు.

ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘‘మొహబ్బత్’ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు. నిర్మాత అఫ్రోజ్ కొత్త వారికి మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు. సినీ కార్మికుల కష్టాలు నాకు తెలుసు. ఎన్ని కష్టాలు వచ్చినా సినిమాల్ని నిర్మిస్తూనే ఉంటారు. పాన్ ఇండియాగా రాబోతున్న ఈ సినిమా మంచి విజయం దక్కించుకోవాలి. దర్శకుడు మ్యాక్‌కి ఈ చిత్రంతో మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

×
×
Ad

చిత్ర దర్శకుడు సలీమ్ మాలిక్ (మ్యాక్) మాట్లాడుతూ.. ‘‘నిర్మాత అఫ్రోజ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ‘మొహబ్బత్‌’ను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఎమోషనల్ యూత్ ఫుల్ జెన్ జీ (Gen-Z) చిత్రంగా ‘మొహబ్బత్’ రానుంది. త్వరలోనే మా సినిమా పాన్ ఇండియా వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అని తెలిపారు. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, సాత్విక్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా, వైఎస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. భాష్యశ్రీ సాహిత్యాలు అందిస్తున్న ఈ చిత్రానికి ఝాషువా యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.