టాలీవుడ్ యంగ్ దర్శకుడు సంకల్ప్ రెడ్డి గుర్తుండే ఉంటాడు. తొలి సినిమాఘాజీ తో సూపర్ హిట్ కొట్టి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు సంకల్ప్ రెడ్డి. ఆ చిత్రానికి గాను జాతీయ అవార్డు అందుకున్నాడు సంకల్ప్. ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా అంతరిక్షం చిత్రాన్ని తెరకెక్కించాడు. కాగా సంకల్ప్ రెడ్డి భార్య కీర్తి రెడ్డి అనుకోని వివాదంలో చిక్కుకుంది. కీర్తి రెడ్డికి ఓ ఫ్యాబ్రిక్ స్టోర్ యజమాని షాక్ ఇచ్చాడు. వివరాలలోకెళితే కీర్తి రెడ్డి బంజారాహిల్స్ లోని రంగ్రెజ్ ఫ్యాబ్రిక్ స్టోర్ ఎదురుగా కారు నిలిపి షాపింగ్ కు వెళ్ళింది.
Also Reddy : Vettaiyan : రూ. 300 కోట్ల క్లబ్ లో రజనీకాంత్ ‘వేట్టయన్- ద హంటర్’
అయితే తన షాప్ ముందు కారు నిలిపి వెళ్లిందని ఆగ్రహించాడు సదరు షాప్ యజమాని. ఆ కోపంతో తన షాప్ ముందు పార్కింగ్ చేసిన కీర్తి రెడ్డి కారు టైర్లను కోసేశాడు రంగ్రెజ్ ఫ్యాభ్రిక్ స్టోర్ యజమాని. షాపింగ్ ముగించుకుని తిరిగి వచ్చిన కీర్తి రంగ్రెజ్ ఫ్యాభ్రిక్ స్టోర్ యజమానీని ఎందుకు ఇలా చేసారని ప్రశ్నించగా దురుసుగా సమాధానం ఇచ్చాడు రంగ్రెజ్ ఫ్యాభ్రిక్ స్టోర్ యజమాని. కారును అలాగే అక్కడే వదిలిపెట్టి బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కీర్తి రెడ్డి. దర్శకుడు సంకల్ప్ రెడ్డికి ఫ్యాషన్ డిజైనింగ్ లో పనిచేస్తున్న కీర్తితో వివాహం జరిగింది. సంకల్ప్ రెడ్డి సినిమాలకు కీర్తి రెడ్డి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించింది.