Hit and Run: సంజయ్ రావ్ బర్త్ డే స్పెషల్ ‘హిట్ అండ్ రన్’ ఫస్ట్ లుక్ అవుట్!

Hit And Run

Hit And Run

ప్రస్తుతం టాలీవుడ్‌లో సరికొత్త స్క్రీన్‌ప్లేతో వచ్చే క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆడియన్స్ ఎప్పుడూ డిఫరెంట్ కంటెంట్‌ను ఎక్స్‌పీరియన్స్ చేసేందుకు ఇష్టపడుతుండటంతో ఈ తరహా సినిమాలకు డిమాండ్ మరింత పెరిగింది. ఈ క్రమంలోనే యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సంజయ్ రావ్, నటాషా సింగ్ మెయిన్ లీడ్స్‌గా రాబోతున్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ హిట్ అండ్ రన్. ‘శ్రీ ఉరుకుంద ఈరణ్ణ స్వామి’ సమర్పణలో సతీష్ రెడ్డి అల్లం ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్రియేషన్స్ బ్యానర్‌లపై సతీష్ రెడ్డి అల్లం, కె. శేఖర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ వైవిధ్యమైన చిత్రానికి సాయి కృష్ణ సాగర్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.

కాగా, హీరో సంజయ్ రావ్ పుట్టినరోజును పురస్కరించుకుని.. శనివారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన మోస్ట్ ఎవైటెడ్ **ఫస్ట్ లుక్ పోస్టర్‌ను** మేకర్స్ గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. తాజాగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని ఒక్కసారిగా పీక్స్‌కు తీసుకెళ్లింది. ఈ పోస్టర్‌లో సంజయ్ రావ్ ముఖంపై తీవ్రమైన గాయాలు, ఒంటిపై రక్తపు మరకలతో కనిపిస్తున్న ఇంటెన్స్ లుక్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆయన కళ్లల్లో కనిపిస్తున్న కోపం, బ్యాక్‌డ్రాప్ థీమ్ చూస్తుంటే.. టైటిల్‌కు తగ్గట్టే ఒక రోడ్ యాక్సిడెంట్ లేదా క్రైమ్ మిస్టరీ చుట్టూ ఈ కథ నడవబోతోందని స్పష్టమవుతోంది. పోస్టర్‌లోనే ఈ రేంజ్ వైబ్స్ కనిపిస్తుండటంతో ‘హిట్ అండ్ రన్’ సిల్వర్ స్క్రీన్‌పై ప్రేక్షకులకు ఒక సాలిడ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వబోతోందని అర్థమవుతోంది.

×
×
Ad