NTV Telugu Site icon

Sodara: ఏప్రిల్‌ 11న సంపూర్ణేష్ బాబు ‘సోదరా’!

Sodara

Sodara

విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ, హీరోగా తనకంటూ ఒక విశిష్టమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ బాబు ఈసారి అన్నదమ్ముల మధ్య ఉండే ఆప్యాయతను కథాంశంగా తీసుకుని, వారి అనుబంధాన్ని చాటి చెప్పే ‘సోదరా’ అనే చిత్రంతో రాబోతున్నాడు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబుతో కలిసి సంజోష్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీ బంసాల్, ఆరతి గుప్తా ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా కొనసాగిస్తున్న ఈ చిత్రం, ఈ వేసవిలో ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆనందపరచనుంది. మన్ మోహన్ మేనం పల్లి దర్శకత్వంలో, క్యాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చంద్ర చగంలా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Ranya Rao: రన్యా రావుకు మరో షాక్.. పిటిషన్ తిరస్కరణ

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, “అన్నదమ్ముల మధ్య ఉండే సంబంధం ఎంత విలువైనదో అందరికీ తెలిసిందే. అలాంటి ఆప్యాయతను వెండితెరపై ప్రదర్శించే చిత్రమే ‘సోదరా’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు నాలుగు పాటలు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందనను రాబట్టాయి. తెలుగు సినిమా పరిశ్రమలో ఎందరో సోదరులు ఉన్నారు, వారి అనుబంధాన్ని ప్రతిబింబించేలా ఈ ‘సోదరా’ రూపొందింది. ఈ వేసవిలో మా చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని గట్టి విశ్వాసం ఉంది,” అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ, “సంపూర్ణేష్ బాబు నుంచి ప్రేక్షకులు ఎదురుచూసే వినోదంతో పాటు, ఆయనలోని మరో ప్రత్యేక కోణాన్ని ఈ సినిమాలో చూడబోతున్నారు. ఈ చిత్రం నిస్సందేహంగా విజయవంతం అవుతుందనే నమ్మకం మాకు ఉంది,” అని అన్నారు.