సంపూర్ణేష్ బాబు హీరోగా మరో కొత్త సినిమా రానుంది. జన్మదిన సందర్భంగా సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. ‘పుడింగి నెం.1’ పేరుతో రూపొందే ఈ సినిమాను శ్రీ పుణ్యభూమి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై మీరావలి దర్శకత్వంలో కె. శ్రీనివాసరావు, కె. సుధీర్ కుమార్ నిర్మిస్తున్నారు. విద్యుత్ లేఖ రామన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా మొదలైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ఆరంభించనున్నారు. షఫీకౌర్ మరో హీరోయిన్ గా నటించే ఈ సినిమాకు ఖుద్దూస్ సంగీతాన్ని అందిస్తున్నారు.