NTV Telugu Site icon

Chiru – Balayya: సమరసింహారెడ్డి విత్ ఇంద్రసేనా రెడ్డి.. బాక్స్ ఆఫీస్ కి ఇన్సూరెన్స్ లు చేయించుకోలమ్మా!

Samarasimha Reddy Indra

Samarasimha Reddy Indra

Samarasimha Reddy Indra Crossover Movie on Cards: నందమూరి బాలకృష్ణ నటుడిగా మారి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఇది ఒక అరుదైన ఘట్టం కావడంతో తెలుగు సినీ పరిశ్రమ అంతా కలిసి ఒక భారీ వేడుక నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిధుల్లో ఒకరిగా హాజరైన చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ వేడుక సందర్భంగా బాలకృష్ణను పొగుడుతూ తాను చేసిన ఇంద్ర సినిమాకి కూడా సమరసింహారెడ్డి ఒకరకంగా ఇన్స్పిరేషన్ అని చిరంజీవి చెప్పుకొచ్చాడు. అప్పట్లో ఫ్యాక్షన్ సినిమాలన్నింటికీ సమరసింహారెడ్డి ఒకరకంగా డిక్షనరీలా ఉండేదని అంటూనే తన ఇంద్రసేనారెడ్డి క్యారెక్టర్ బాలకృష్ణ సమరసింహారెడ్డి క్యారెక్టర్ లను కలుపుతూ ఒక సినిమా చేస్తే బాగుంటుందని ఆయన అన్నారు. అంతేకాక అలాంటి సినిమా కథ తన దాకా వస్తే చేయడానికి రెడీ అని అనడమే కాక బాలయ్యతో కూడా రెడీ అనిపించాడు. వెంటనే వేదిక కింద ఉండి వేడుక చూస్తున్న బోయపాటి శ్రీనుని పలకరిస్తూ ఏం బోయపాటి మీకే ఛాలెంజ్ వేస్తున్న స్వీకరించండి అన్నట్టుగా చిరంజీవి మాట్లాడారు.

Raj Tarun: పరిస్థితులే తప్పులు చేయిస్తాయి.. లావణ్య ఇష్యూపై రాజ్ తరుణ్ సంచలనం

అయితే బోయపాటి శ్రీను అప్పటికప్పుడు ఏం మాట్లాడలేదు కానీ ఇప్పుడు ఈ చాలెంజ్ ను ఒక కుర్ర డైరెక్టర్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఆ కుర్ర డైరెక్టర్ ఇంకెవరో కాదు హనుమాన్ సినిమాతో తెలుగు సినిమా సత్తాను మరోసారి ఇండియా వైడ్ చాటి చెప్పిన ప్రశాంత్ వర్మ. ప్రస్తుతానికి ప్రశాంత్ వర్మకు బాలకృష్ణకు మంచి టర్మ్స్ ఉన్నాయి. బాలకృష్ణతో అన్ స్టాపబుల్ షో చేయడం, ఇప్పుడు మోక్షజ్ఞతో ఆయన లాంచింగ్ సినిమా చేస్తూ ఉండడంతో ప్రశాంత్ వర్మకు నందమూరి కాంపౌండ్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. హనుమాన్ తర్వాత చిరంజీవి కాంపౌండ్ తో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ ఉద్దేశంతో చాలెంజ్ యాక్సెప్ట్ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడో లేక వేరే ఏదైనా విషయం మీద స్పందిస్తూ పెట్టాడో తెలియదు. కానీ ప్రేక్షకులు మాత్రం ప్రశాంత్ , మెగాస్టార్ చిరంజీవి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. అదే కనుక నిజమైతే ఇక బాక్స్ ఆఫీస్ కి కూడా ఇన్సూరెన్స్ లు చేయించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో.

Show comments