Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!

Samantha

Samantha

Samantha Seemantham: స్టార్ హీరోయిన్ సమంత తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన ఘట్టాన్ని ఘనంగా జరుపుకున్నారు. హిందూ సనాతన ధర్మంలో ఎంతో విశిష్టమైన ‘శ్రీవిద్య’ సంప్రదాయ పద్ధతిలో ఆమె సీమంతం వేడుక అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. భర్త రాజ్ నిడిమోరు, అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. సాధారణంగా జరిగే వేడుకలకు భిన్నంగా, అత్యున్నత తాంత్రిక, వైదిక పద్ధతుల్లో ఒకటైన ‘శ్రీవిద్య’ సంప్రదాయాన్ని అనుసరించి ఈ సీమంతాన్ని నిర్వహించడం విశేషం. దైవిక ఆశీస్సులు, సానుకూల శక్తుల పరిరక్షణ కోసం ఈ విధానంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సమంత ఈ క్రతువులో పాల్గొని దేవుడి దీవెనలు అందుకున్నారు.

“నాకు, నా బిడ్డకు దక్కిన వరం”

ఈ మధుర క్షణాలకు సంబంధించిన దృశ్యాలను సమంత స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. “ఈ పవిత్రమైన వేడుక నాకు, నా కడుపులోని బిడ్డకు లభించిన గొప్ప ఆశీర్వాదం” అంటూ ఆమె భావోద్వేగంతో రాసుకొచ్చారు. సమంత పంచుకున్న ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ కావడంతో, నెటిజన్లు, సినీ ప్రముఖులు, అభిమానులు కామెంట్ల రూపంలో ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జీవితంలోని ఈ సరికొత్త ప్రయాణంలో సమంత ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ కంగ్రాట్స్ చెబుతున్నారు.