Site icon NTV Telugu

Samantha: బాలీవుడ్ హీరోతో స్యామ్.. డేట్స్ కూడా ఇచ్చేసిందట..?

Samantha

Samantha

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్‌గా ఎదిగి.. ద‌క్షిణాది అన్ని భాష‌ల్లోనూ స్టార్ డ‌మ్ తెచ్చుకున్న స‌మంత బాలీవుడ్‌లో అడుగు పెట్ట‌బోతోంది. అయితే.. ఇప్ప‌టికే ది ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్ రెండో సీజన్‌, పుష్ప సినిమాలో ఐట‌మ్ సాంగ్‌తో ఉత్త‌రాది ప్రేక్ష‌కుల‌కు స‌మంత చేరువైన విస‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో.. బాలీవుడ్‌లో సమంత అరంగేట్రం ఎప్పుడు అనే చ‌ర్చ జోరుగా న‌డుస్తోంది. అయితే స్యామ్‌ బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్‌తో తొలి సినిమా చేస్తుంద‌ని ఫుల్ గా ప్రచారం జ‌రిగింది. ఇక తాజా స‌మాచారం మేర‌కు స‌మంత ఓ యువ హీరోతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌నుంది.

అయితే బాలీవుడ్ లో వైవిద్యమైన పాత్రలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆయుష్మాన్‌ ఖురానా. ఆయన హీరోగా నటించనున్న ఓ సినిమాలో స్యామ్ కూడా హీరోయిన్‌గా బాలీవుడ్‌కు ప‌రిచ‌యం అవుతుంద‌ని స‌మాచారం. అయితే.. ఈ చిత్రాన్ని దినేష్‌ విజయ్ నిర్మిస్తారని.. ఇప్ప‌టికే స్క్రిప్ట్ వ‌ర్క్ కూడా పూర్త‌యింద‌ని తెలుస్తోంది. ఈనేప‌థ్యంలో.. స‌మంత డేట్స్ కూడా ఇవ్వ‌డంతో షూటింగ్‌ షెడ్యూల్స్‌ చర్చలు జరుగుతున్నాయని బాలీవుడ్‌లో జోరుగా ప్ర‌చారం న‌డుస్తోంది. అయితే.. హిందీలో సమంత నటించనున్న తొలి సినిమాకు అంతా సిద్ధమైందని అర్థం చేసుకోవ‌చ్చు. స్యామ్ .. విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ఖుషి మొదటి షెడ్యూల్‌ ముగిసింది. దీనికి సంబందించిన న్యూషెడ్యూల్ వైజాగ్‌లో మొదలవబోతుంది. అయితే.. ప్రస్తుతం సమంత నటించిన శాకుంతలం యశోద సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటున్నాయి. స్యామ్ యశోద సినిమా రిలీజ్ కూడా త్వరలోనే ఉండబోతుందని టాక్. స్యామ్ ఇలా సినిమా తర్వాత సినిమాను కంప్లీట్ చేస్తున్న సమంత..వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌ను కమిటవుతోంది.

Teddy Bear and Micky Mouse:ఏదో చేద్దామనుకున్నాడు.. అరెస్టయ్యాడు

Exit mobile version