NTV Telugu Site icon

Samantha: సిటాడెల్ ప్రయాణాన్ని ప్రారంభించడం అంత సులభం కాదు…సమంత షాకింగ్ కామెంట్స్!

Sam

Sam

Samantha Ruth Prabhu: టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది.ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో పేరు తెచ్చుకున్న రాజ్ అండ్ డీకే ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్నా మూవీ సిటాడెల్. మయోసైటిస్ వ్యాధి బారి నుంచి ఈ మధ్యనే కోలుకున్న సామ్.. పెండింగ్ ఉన్న తన సినిమాలను కంప్లీట్ చేస్తోంది. ప్రస్తుతం సామ్ నటిస్తున్న చిత్రాల్లో సిటాడెల్ ఒకటి. అమెజాన్ ప్రతిష్టాత్మకంగా ఈ సిరీస్ ను నిర్మిస్తోంది.. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి సామ్ ఈ సిరీస్ లో కనిపించనుంది. ఈ మధ్యనే ఈ సిరీస్ షూటింగ్ మొదలయ్యింది. హాలీవుడ్ లో సిటాడెల్ కి మంచి రెస్పాన్స్ రావడం తో అందులో ప్రియాంక చోప్రా చేసిన పాత్రను ఇక్కడ సమంత చేస్తోంది. ఇక ఈ చిత్రం కోసం సామ్ ఎన్నో రిస్క్ లు కూడా చేసింది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Also Read; VishwakSen: విశ్వక్ సేన్ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసింది..

అయితే సిటాడెల్ గురించి సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను మైయోసైటిస్‌తో పోరాడడం వల్ల సిటాడెల్ ప్రయాణాన్ని ప్రారంభించడం అంత సులభం కాదు అని తీవ్రమైన యాక్షన్ సన్నివేశాల మధ్య, నేను చాలా బలంగా ఆ సవాళ్లను ఎదుర్కొన్నాను మరియు వాటిలో నేను పాస్అవుట్ కూడా అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక మేకర్స్ రిలీజ్ చేసిన అమెజాన్ వీడియో లో సిటాడెల్ కు సంబంధించిన షాట్స్ నే ఎక్కువగా కనిపించాయి. సామ్ స్టైలిష్ స్పై గా అదరగొట్టింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్, గన్ పట్టుకొని పోరాడే షాట్స్ అయితే వేరేలేవేల్ అని చెప్పుకోవచ్చు. ప్రియాంకను డామినేట్ చెసాలా సామ్.. ఎంతో అందంగా కనిపించింది. మరి సిరీస్ ఎలా ఉంటుంది అనేది రిలీజ్ తరువాత చూడాల్సిందే.

Show comments