Site icon NTV Telugu

Samantha: డేట్ చేస్తున్న డైరెక్టర్తో తిరుమలకి సమంత?

Samantha Raj

Samantha Raj

గత కొంతకాలంగా సమంత, రాజ్ నిడుమోరు అనే డైరెక్టర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో నాగచైతన్య, సమంత ప్రేమించి వివాహం చేసుకున్నారు. తర్వాత విభేదాలు రావడంతో లీగల్‌గా విడాకులు తీసుకున్నారు. ఇక ఇప్పుడు నాగచైతన్య, శోభితను వివాహం చేసుకొని కొత్త జీవితం మొదలుపెట్టాడు. గత కొంతకాలంగా సమంత, రాజ్ డీకే ద్వయంలో రాజ్‌తో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వారు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంపై సమంత గానీ, ఆమె టీమ్ గానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

Meenakshi Chaudhary : మీనాక్షి ఘాటు ఫోజులు

ఇక ఈ రోజు సమంత నిర్మించిన ‘శుభం’ అనే సినిమా టీమ్‌తో కలిసి సమంత తిరుమల దర్శనానికి వెళ్లింది. ఈ సందర్భంగా సమంతతో పాటు రాజ్ కూడా దర్శనం చేసుకోవడంతో వారి ప్రేమ పుకార్లకు మరింత బలం చేకూరినట్లయింది. ఇక ‘శుభం’ అనే సినిమాను సమంత కొత్తగా ఏర్పాటు చేసిన నిర్మాణ సంస్థ ట్రాలాలా నిర్మించింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న క్రమంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుంది సినిమా టీమ్. సమంత క్రిస్టియన్ అయినప్పటికీ, తనకు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందని, అందుకే దర్శనానికి వచ్చానని డిక్లరేషన్ ఫారమ్‌పై సంతకం చేసింది.

Exit mobile version