Site icon NTV Telugu

Samantha: ముంబైలో ఫోటోగ్రాఫర్లపై సమంత అసహనం

Samantha

Samantha

సమంత ముంబైలో తన జిమ్ బయట జరిగిన ఒక ఘటనలో పాపరాజీ(ఫోటో, వీడియో గ్రాఫర్)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంగళవారం ఉదయం, సమంత ముంబైలోని తన జిమ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో పాపరాజీ ఫోటోగ్రాఫర్లు ఆమెను చుట్టుముట్టి ఫోటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించారు. బ్రౌన్ కలర్ స్పోర్ట్స్ వేర్‌లో ఉన్న సమంత, ఫోన్‌లో మాట్లాడుతూ బయటకు వచ్చారు.

Also Read:Se*xual Assault: జైలు నుండి విడుదలై రెండు రోజులు కాలేదు.. 80 ఏళ్ల వృద్ధ మహిళపై అత్యాచారం..!

అయితే, పాపరాజీ ఆమె పేరును పిలుస్తూ, “గుడ్ మార్నింగ్, సమంత మేడం” అంటూ ఫోటోలు తీయడం ప్రారంభించారు. ఈ హడావిడి, గోల సమంతకు అసౌకర్యాన్ని కలిగించింది. ఆమె వెంటనే “స్టాప్ ఇట్, గైస్, ప్లీజ్” అంటూ పాపరాజీని ఫోటోలు తీయడం ఆపమని కోరారు. అయినప్పటికీ, కొంతమంది ఫోటోగ్రాఫర్లు ఆమె మాటలను పట్టించుకోకపోవడంతో ఆమె మరింత అసహనం వ్యక్తం చేశారు. తన కారు అక్కడ లేకపోవడంతో కొద్దిసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఇది ఆమెకు మరింత అసౌకర్యాన్ని కలిగించింది.

Also Read:Air India: బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్లలో సమస్య.. ఒకే రోజు లండన్, పారిస్ విమానాలు రద్దు..

తర్వాత ఆమె శాంతించి, “సారీ, గైస్” అని చెప్పి మరోసారి ఫోటోలు తీయవద్దని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సంఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ప్రస్తుతం సమంత ఇటీవల ‘సుభం’ అనే తెలుగు చిత్రంలో నటించడమే కాకుండా, దాని నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ చిత్రం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే, ఆమె రాబోయే తెలుగు చిత్రం ‘మా ఇంటి బంగారం’ మరియు హిందీ సిరీస్ ‘రక్త బ్రహ్మాండ్’లో నటిస్తున్నారు.

 

Exit mobile version