Site icon NTV Telugu

Samantha: ఫ్యామిలీ మాన్ కాంబో రిపీట్ చేస్తున్న సమంత..

Samantha On Imdb

Samantha On Imdb

Samantha ropes in Tumbbad Director Web Series starring Aditya Roy Chopra by Raj DK: అనారోగ్య కారణాలతో సమంత బాధ పడిన సంగతి తెలిసిందే. తన అనారోగ్య కారణాలతో సినిమాలు వాయిదా పడ కూడదని కష్టపడి సినిమాలను పూర్తి చేసిన సమంత.. కొన్ని నెలలు రెస్ట్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ పరిస్థితిలో తాను మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అయ్యానని ఇటీవల ప్రకటించింది సమంత. ఆమె తదుపరి హిందీ వెబ్ సిరీస్‌లో నటించబోతోంది. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌కి దర్శకత్వం వహించిన రాజ్ మరియు డికె దర్శకత్వంలో సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలో విడుదలకు రెడీగా ఉంది. ఇక ఈ సందర్భంలోనే రాజ్, డీకే నిర్మిస్తున్న భారీ వెబ్ సిరీస్ లో సమంత నటించబోతోందని అంటున్నారు. ఈ సిరీస్ ను తుంబాద్ ఫేమ్ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్నారు.

AP Rains: రాబోయే 2 రోజులు ఏపీలో వానలే వానలు..!

సమంత మాజీ భర్త నాగ చైతన్యతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్న నటి శోభిత దూళిపాళ్ల చివరిగా బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్‌తో కలిసి ది నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. ఇప్పుడు అదే ఆదిత్య రాయ్ కపూర్‌తో సమంత జత కట్టిందని అంటున్నారు. సినిమాల పరంగా నటి సమంతకు యశోద ఫరవాలేదు అనిపించుకున్న ఆ తర్వాత ఆయన నటించిన ఖుషి, శాకుంతలం సినిమాలు ఇబ్బంది పెట్టాయి. ఆ తరువాత అనారోగ్య కారణాలతో సమంత సినీ కెరీర్ లో మళ్ళీ పుంజుకోవాలని ప్రయత్నిస్తోంది. సమంతా హిందీ సినిమాలు చేస్తే బాగుంటుందని అందరూ అనుకుంటుంటే భావించగా, సమంత ఓటీటీ వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ సమంతకు భారీ హిట్ ఇచ్చిన తర్వాత, ఆమె సైటాడెల్ వెబ్ సిరీస్ విడుదల కోసం వేచి ఉంది.

Exit mobile version