NTV Telugu Site icon

Samantha : మరోసారి కొండా సురేఖపై సమంత కీలక వ్యాఖ్యలు..

Konda

Konda

అక్కినేని నాగార్జున కుటుంబంపై అలాగే నాగ చైతన్య మాజీ శ్రీమతి సమంతపై తెలంగాణ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిన విషయమే. దింతో టాలీవుడ్ నటీనటుల అందరు ఏకమై కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుబడుతూ అక్కినేని నాగార్జునకు మద్దతుగా నిలిచారు. అలానే నటి సమంత కూడా కొండా సురేఖకు నా విడాకులు నా వ్యక్తిగతం నా పేరును రాజకీయాలకు దూరంగా ఉంచాలని కాస్త ఘాటుగా జవాబు ఇచ్చింది సమంత. నాగార్జున కూడా కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసు వేసాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది.

Also Read : Allu Arjun : పుష్ప – 2 రిలిజ్ డేట్ మారేది లేదు.. ఎవడొచ్చిన తగ్గేదేలేదు..

కాగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సమంత మరోసారి స్పందించారు. సమంత ఇటీవల ‘సిటాడెల్: హనీ బన్ని’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ క్రమంలోనే  నిర్వహించిన ఓ  ప్రెస్ మీట్ లో పాల్గొన్న సామ్ కొండా సురేఖ వ్యాఖ్యల గురించి ఓ రిపోర్టర్  ప్రశ్నించగా సమంత మాట్లాడుతూ ” ఈరోజు ఇక్కడ కూర్చోవడానికి సౌత్ ఇండస్ట్రీలోని చాలా మంది సినీ నటీనటులు తనకు మద్దతు ఉంది. వారందరి సపోర్ట్ కారణంగానే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. నా గురించి దారుణమైన వ్యాఖ్యలు చేసినప్పుడు సౌత్ ఇండస్ట్రీ మొత్తం నావైపు నిలబడింది. వారందరూ నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ప్రేమ, నాపై వారికి ఉన్న నమ్మకమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. కష్టాలను ఎదుర్కోవడంలో వారి మద్దతు నాకెంతో సాయపడింది. వారు నా పక్షాన నిలవకపోతే నేను మరింతగా కుంగిపోయేదాన్ని. నా చుట్టూ ఉన్నవారి మద్దతు వల్లే ఇప్పుడు ఇక్కడ కూర్చోగలిగాను సమస్యలను ఎదుర్కోగలిగాను’ అని అన్నారు.