Site icon NTV Telugu

Salman khan : బాలీవుడ్ భాయ్‌ను టేకప్ చేసిన మలయాళ మాస్ మేకర్!

Salman Khan

Salman Khan

బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ సరైన హిట్ కొట్టి చాలాకాలమే అవుతుంది. ‘రాధే’, ‘కిసీ కా భాయ్…’, ‘టైగర్ 3’ వంటి సినిమాలతో ఎన్ని ప్రయత్నాలు చేసినా, భాయ్‌కు గత గ్లామర్ రీచ్ కాలేదు. అభిమానులు ఎదురుచూస్తున్న బిగ్ బ్లాక్‌బస్టర్ దొరకలేదు. అయితే తాజాగా సల్మాన్‌ ఇక వెరైటీ ప్రయత్నాలకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ‘బాటిల్ ఆఫ్ గాల్వాన్’ అనే యుద్ధ నేపథ్య చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న సల్మాన్.. ఇక తన తదుపరి ప్రాజెక్టు కోసం దక్షిణాది నుంచి సరికొత్త కాంబినేషన్ను ఎంపిక చేసుకున్నారు.

Also Read : Tamannaah : సె** స్వచ్ఛమైన.. పవిత్రమైన కార్యం.. తప్పుగా చూడ‌డం మానుకోండి

తాజాగా మలయాళ మాస్ మేకర్ మహేశ్ నారాయణన్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ థ్రిల్లర్ చేయబోతున్నట్లు సమాచారం. అది కూడా 1970ల కాలం నాటి నేపథ్యంలో జరిగే కథగా ఇది ఉండబోతోందట. ఇప్పటికే మహేశ్‌తో సల్మాన్‌ ముంబయిలో రెండు సార్లు సమావేశమై స్క్రిప్ట్ చర్చలు ముగించారని టాక్. ఈ సినిమా‌తో సల్మాన్ తన కమ్ఫర్ట్ జోన్ నుండి పూర్తిగా బయటకు వచ్చేందుకు రెడీ అయ్యారని, “ఇది భయ్ ఫ్యాన్స్‌కు ఓ ఊహించని షాక్ అవుతుంది” అని వర్గాలు చెబుతున్నాయి. మహేశ్ నారాయణన్‌ డైరెక్షన్‌ అంటేనే రిఅలిస్టిక్ టేకింగ్, డీప్ ఎమోషన్స్, అందుకే భాయ్ ఈసారి కథకు తగ్గట్టు తనను మార్చుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుపై ఆఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఈ ఏడాది చివర్లో ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. మరి మలయాళ మేకర్ టేకింగ్‌కి బాలీవుడ్ భాయ్ ఫుల్ స్కోరు ఇస్తారా? సల్మాన్ కెరీర్‌కి ఇది కొత్త బూస్టా అవుతుందా? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నాయి.

 

Exit mobile version