బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మూవీస్ విషయం పక్కన పెడితే .. భారతీయ చిత్ర పరిశ్రమలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే ఆయన పేరే ముందు వరుసలో ఉంటుంది. దాదాపు 60 ఏళ్ళకు దగ్గరైనా ఈ అగ్రనటుడు నేటికీ బ్యాచిలర్ గానే జీవితాని కొనసాగిస్తున్నాడు. కెరీర్‌లో ఎంతోమంది ముద్దుగుమ్మలతో డేటింగ్, ఎఫైర్స్ నడిపించిన ఈ కండల వీరుడు పెళ్లి పీటలెక్కడంలో మాత్రం విఫలమవుతున్నాడు. వేల కోట్ల సంపద, కోట్ల మంది అభిమానులు, విలాసవంతమైన జీవితం, పేరు ప్రఖ్యాతులు అని ఉన్నప్పటికీ కూడా సల్మాన్ జీవితానికి ఒక తోడు మాత్రం లేదు.
Also Read : Surya : సూర్య 45 మూవీ టైటిల్ ఫిక్స్..?
అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం ఏంటి అంటే.. అలనాటి హీరోయిన్ జుహీ చావ్లాతో మాత్రం పెళ్లి పీటల వరకు వెళ్లాడు సల్మాన్. 90వ దశకంలో వీరిద్దరి జోడీ బాలీవుడ్‌ను ఊపేసిందని చెప్పాలి. అందంతో పాటు జూహీ వ్యక్తిత్వం కూడా నచ్చడంతో ఆమెలో ప్రేమలో పడ్డాడట సల్మాన్ ఖాన్.. ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకొని ఈ విషయాన్ని జూహీ చావ్లా తండ్రి వద్ద ప్రస్తావించగా ఆయన ససేమిరా అన్నారట. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.. ‘ఆమె చాలా అందమైన, అట్రాక్టివ్ అమ్మాయి. జూహీ తో పెళ్లి గురించి ఆమె తండ్రి తో మాట్లాడాను కానీ ఆయన ఒప్పుకోలేదు. బహుషా నేను వారి ఎక్స్‌పెక్టేషన్స్‌కు సరిపోలేదేమో’ అని నవ్వుతూ చెప్పాడు. నాటి నుంచి పెళ్లికి దూరంగా ఉన్న సల్మాన్.. ఒంటరిగానే జీవితాన్ని గడుపుతున్నారు. ఒకవేళ జూహీని కనుక సల్మాన్ పెళ్లాడి ఉంటే.. ఆయన జీవితం మరోలా ఉండేదని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.