NTV Telugu Site icon

Salmaan Khan : ‘సికందర్’ ట్రైలర్‌కు డేట్ ఫిక్స్

Sikandhar

Sikandhar

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ భారీ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన సల్మాన్ గ్రాఫ్ గత కోది రోలుగా డౌన్‌లో ఉంది. ఈ సరి ఎలా అయిన తన అభిమానులను తృప్తిపరచడం కోసం ‘సికందర్’ మూవీతో వస్తున్నాడు . రష్మిక హీరోయిన్‌గా, దర్శకుడు మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు సల్మాన్. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి చాలా వార్తలు వైరల్ అవుతున్నప్పటికి..

మార్చి 30న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. మామూలుగా సల్మాన్ తన సినిమాలు శుక్రవారం విడుదలయ్యేలా చూస్తాడు. కానీ ‘సికందర్’ మాత్రం ఆదివారం విడుదల చేయాలనే నిర్ణయం పట్ల కొంత ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రంజాన్ ఉపవాసాలు పూర్తయ్యే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆదివారం రిలీజ్ అనుకున్నారని టాక్. ఇదిలా ఉంటే ఈ మూవీ నుండి ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకోగా..తాజాగా సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. కాగా ఈ ట్రైలర్‌ను మార్చి 23న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. మరిక ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకోవడం ఖాయమని మేకర్స్ చెబుతున్నారు. సల్మాన్ ఖాన్ నటన,యాక్షన్ సీన్స్ అభిమానులకు మంచి ట్రీట్ ఇస్తుందని వారు చెబుతున్నారు.