Salman Khan: ఒంటరితనం పోస్ట్ వెనుక అసలు నిజం చెప్పిన సల్మాన్ ఖాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ‘సుల్తాన్’, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ (Salman Khan) తాను ఒంటరిగా ఉన్నానంటూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక షర్ట్‌లెస్ ఫొటో, దానికి పెట్టిన క్యాప్షన్ దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. సల్లూ భాయ్ మానసిక ఒత్తిడిలో ఉన్నారేమోనని ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే, ఈ వివాదం కాస్త ముదిరి తన స్వంత ఇల్లు గెలాక్సీ అపార్ట్మెంట్ వరకు చేరడంతో.. తాజాగా సల్మాన్ ఖాన్ ఆ వైరల్ పోస్ట్‌పై స్పందిస్తూ అసలు నిజం ఏంటో క్లారిటీ ఇచ్చారు.
‘నేను నా వ్యక్తిగత జీవితం గురించి ఆ పోస్ట్‌లో మాట్లాడలేదు. అయినా.. ఇంత పెద్ద కుటుంబం, కోట్లాది మంది స్నేహితులు, అభిమానులు ఉన్నప్పుడు నేను ఎలా ఒంటరివాడిని అవుతాను? మీ అందరి ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉంటే నేను ఒక్కడినే అనే భావన నాలో ఎందుకు వస్తుంది. మీరంతా నాతో ఉంటున్నా.. నేను ఒంటరిగా ఉన్నానని అనుకుంటే నేను కృతజ్ఞత లేనివాడిని అవుతాను. షూటింగ్స్ నుండి నా కోసం కొంచెం సమయం కేటాయించుకోవాలనిపించిందంతే. దాన్ని మీరంతా హైలైట్ చేసి హెడ్‌లైన్స్‌గా మార్చేశారు. కనీసం నా ఫొటో కూడా సరిగ్గా చూడకుండా బ్రేకింగ్ న్యూస్ చేసేశారు. ఆ వార్తలు చూసి మా అమ్మ కూడా నన్ను ‘ఏమైంది నాన్న?’ అని కంగారుగా అడుగుతోంది. ప్లీజ్.. రిలాక్స్ అవ్వండి ఫ్రెండ్స్, నాకేం కాలేదు’ అని సల్మాన్ ఇచ్చిన ఈ క్లారిటీతో అటు బాలీవుడ్ మీడియా వర్గాలు, ఇటు మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కేవలం తన పర్సనల్ స్పేస్ (Me Time) కోసం పెట్టిన పోస్ట్‌ను మీడియా ఇంతగా రచ్చ చేయడంపై సల్లూ భాయ్ స్టైల్లోనే కౌంటర్ పడిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
FIFA World Cup 2026: మెరినో మ్యాజిక్.. బెల్జియంపై 2-1 థ్రిల్లర్ విజయంతో సెమీస్‌లోకి స్పెయిన్.!
-
Sudha Kongara: రూ.8.39 కోట్ల పారితోషిక వివాదం.. సుధా కొంగరకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ
-
Yamaha FZ Flex Fuel: యమహా FZ Flex Fuel బైక్ విడుదల.. ఇప్పుడు E85 ఇంధనంతోనూ పరుగులు.. ధర, ఫీచర్లు ఇవే
-
Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్‌లు..! ప్రత్యేక మెకానిజం
-
ENG vs IND Playing XI: నేడే చివరి టీ20.. వైట్‌వాష్‌ను భారత్ తప్పించుకుంటుందా.?
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!