సల్మాన్ అనగానే ఇప్పుడు అందరూ భాయ్ జాన్ అనేస్తున్నారు. అందుకు కారణం… ఏజ్ అండ్ క్రేజ్ పెరుగుతున్నకొద్దీ అతను తెచ్చుకున్న ఇమేజే! అయితే, ‘బజ్రంగీ భాయ్ జాన్’ తరువాత మరింతగా ‘భాయ్’ అయిపోయాడు ఒకప్పటి ఈ బ్యాడ్ బాయ్! రకరకాల కోర్టు కేసులు, లవ్ ఎఫైర్ల తరువాత ‘బీయింగ్ హ్యూమన్’ అంటూ మంచోడిగా మారే ప్రయత్నం చేశాడు కండల వీరుడు. అందుకే, స్లోగా భాయ్ జాన్ ఇమేజ్ ను మరింత పెంచుకోవాలనుకుంటున్నాడు!
హిందీలో భాయ్ జాన్ అంటే ‘అన్నగారు’ అని కదా అర్థం… అందుకే, త్వరలో సల్మాన్ ఓ సినిమాలో ఇద్దరు తమ్ముళ్లకి అన్నయ్యగా నటించబోతున్నాడట. పైగా అందులో స్టోరీ మన ‘దబంగ్ ఖాన్’ రియల్ లైఫ్ కి దగ్గరానే ఉంటుందట. పెద్దన్నయ్యకి పెళ్లికాకపోవటంతో తమ్ముళ్లు ఇద్దరు నానా తంటాలు పడతారని ‘కభీ ఈద్ కభీ దివాలీ’ సినిమా టీమ్ చెబుతోంది. ప్రస్తుతం చేస్తోన్న ‘టైగర్ 3’ తరువాతి సల్మాన్ చేయబోయే సినిమా ఇదే. అయితే, లెటెస్ట్ గా ‘కభీ ఈద్ కభీ దివాలీ’ సినిమాలో భాయ్ జాన్ తమ్ముళ్లు ఎవరో తెలిసిపోయింది! ఆయుష్ శర్మ, జహీర్ ఇక్బాల్ సల్మాన్ సోదరులుగా అలరించనున్నారు…
‘నోట్ బుక్’ సినిమాలో నటించిన జహీర్ ఇక్బాల్ సల్మాన్ పెద్ద తమ్ముడిగా నటించనుండగా…. చిన్న వాడిగా ఆయుష్ శర్మ కనిపిస్తాడు. తెర మీద తమ్ముడిగా నటించే ఆయుష్ రియల్ లైఫ్ లో సల్మాన్ చెల్లెలు భర్తే! ఇక ఫర్హాద్ సమ్జీ దర్శకత్వంలో రానున్న ‘కభీ ఈద్ కభీ దివాలీ’ సినిమాకి సాజిద్ నడియాడ్ వాలా నిర్మాత. అంతే కాదు, సినిమా సెట్స్ మీదకు వెళ్లేలోపు ‘కభీ ఈద్ కభీ దివాలీ’ అనే టైటిల్ కూడా మారిపోవచ్చట! తనని తాను ‘భాయ్ జాన్’ గా ప్రమోట్ చేసుకుంటోన్న సల్మాన్ సినిమా పేరుగా కూడా అదే ఫిక్స్ చేయమంటున్నాడట! చూడాలి మరి, ‘భాయ్ జాన్’ గా వస్తే ‘రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ని ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో…