Salaar : 2024 బుల్లితెరపై రికార్డులు బద్దలు కొట్టిన ‘సలార్’
- ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్
- స్టార్ గోల్డ్ లో రికార్డు క్రియేట్ చేసిన సలార్
- ప్రభాస్ బర్త్ డే కానుకగా సలార్ స్పెషల్ షోస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా గతేడాది వచ్చిన చిత్రం సలార్. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిన విషయమే. థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ లోను రికార్డు వ్యూస్ రాబట్టింది. నెట్ ఫ్లిక్స్ రిలీజైన మొదటి పది రోజులు ఇండియా టాప్ వన్ లో ట్రెండింగ్ లో కొనసాగింది సలార్. తాజగా ఈ చిత్రం బుల్లి తెరపై కూడా బద్దలు కొట్టి వ్యూస్ మరొక రికార్డు క్రియేట్ చేసింది.
Also Read : AindhamVedham : ‘ఐందామ్ వేదం’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన విజయ్ సేతుపతి
Also Read
ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. తెలుగు తో పాటు హిందీ ప్రేక్షకులను కూడా విశేషంగా అలరించింది. వివరాలలోకెళితే 2024లో టాప్ త్రీ టెలివిజన్ ప్రీమియర్‌లలో సలార్ ఒకటిగా నిలిచింది. 25 మే 2024న, హిందీ వెర్షన్ సలార్: పార్ట్ – 1 ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌ను స్టార్ గోల్డ్‌లో ప్రదర్శించింది. స్టార్ ఫోల్డ్ లో 2023 నుండి ఇప్పటివరకు TVలో ప్రదర్శించబడుతున్న అత్యధిక రేటింగ్ పొందిన డబ్బింగ్ చిత్రంగా సలార్ నిలిచింది. దాదాపు 30 మిలియన్లకు పైగా వీక్షకుల సంఖ్యతో, TV ప్రీమియర్ చలన చిత్రాలలో అత్యధిక వ్యూస్ రాబట్టిన సినిమాగా సలార్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ విషయమై అధికారకంగా తెలిపింది స్టార్ గోల్డ్. ముఖ్యంగా ఈ చిత్రంలోని యాక్షన్ ఎపిసోడ్స్ బాలీవుడ్ ప్రేక్షకులను విజువల్ ఫీస్ట్ అందించాయి. మరోవైపు రెబల్ స్టార్ బర్త్ డే కానుకగా ఈ నెల 19, 20 తేదీలలో తెలుగు రాష్ట్రల్లో స్పెషల్ షోస్ ప్రదర్శిస్తుండగా నిమిషాల వ్యవధిలో సోల్డ్ కావడం సలార్ స్టామినా ఏంటో తెలియజేస్తుంది.
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!