Site icon NTV Telugu

Saiyami Kher : టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌పై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు ..!

Saiyami Kher,

Saiyami Kher,

ఇండస్ట్రీ ఎదైనప్పటికి క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికే చాలా మంది నటిమనులు ఈ విషయం గురించి మాట్లాడారు. కొంత మంది పేర్లతో సహా వారికి జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నారు. ఇక తాజాగా టాలీవుడ్‌లో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ప్రముఖ నటి సయామీ ఖేర్‌ కీలక విషయాలను బయటపెట్టింది.

Also Read: Varma : ‘వార్ 2’ టీజర్‌లో కియారా బికినీ బ్యాక్‌పై ఆర్జీవీ బోల్డ్ కామెంట్..

2015లో ‘రేయ్‌’ మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైంది సయామీ. ఆ తర్వాత 2016లో మిర్జియాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి మౌళి, చోక్డ్‌, వైల్డ్‌డాగ్‌, ఘూమర్‌ చిత్రాలతో పాటు పలు వెబ్‌సిరీస్‌లలోనూ నటించగా, రీసెంట్‌గా సన్నీ డియోల్‌ హీరోగా.. గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో వచ్చిన ‘జాట్‌’మూవీలో కూడా నటించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో నాకు వచ్చిన అవకాశాలతో సంతృప్తిగానే ఉన్నాను. కానీ కెరియర్‌ ప్రారంభంలో జరిగిన ఘటన మాత్రం నను తీవ్రంగానే బాధించింది. ఓ తెలుగు సినిమా ఏజెంట్‌ నను కలిశారు. మూవీ ఛాన్స్‌ల కోసం కొన్ని విషయాల్లో సర్దుకుపోవాల్సి ఉంటుందని అన్నారు. ఓ మహిళ అయి ఉండి.. సాటి మహిళతో అలా మాట్లాడటం సహించలేకపోయా.. మొదట ఆమె మాటలు అర్థం కానట్లుగా నటించాను.. తరచూ అదే విషయం చెబుతుండడంతో ‘క్షమించండి. మీరు నన్ను ఆ మార్గంలో వెళ్లాలని చెబుతున్నారు. కానీ నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. వాటిని నేను ఎప్పటికీ దాటను’ అని చిన్న పాటి వార్నింగ్ ఇచ్చా. నా కెరియర్‌లో ఓ మహిళ నుంచే ఇలాంటి ప్రతిపాదన రావడం అదే తొలిసారి, చివరిసారి’ అంటూ చెప్పుకొచ్చింది.

Exit mobile version