ప్రజంట్ ప్రేక్షకులు ఎలాంటి సినిమాలకు ఎలా రియాక్ట్ అవుతున్నారో చెప్పడం కష్టతరంగా మారింది. వంద కోట్ల బజ్టెట్తో వచ్చిన సినిమాలను కనీసం పటించుకోవడంలేదు.. ఊహించని విధంగా చిన్న సినిమాలను మాత్రం ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇందుకు నిదర్శనం ‘సైయారా’. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం. దీంతో ఈ చిత్ర దర్శకుడు మోహిత్ సూరి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Also Read : Sudheer Babu : ‘జటాధర’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..
మోహిత్ సూరి.. ‘‘ నా 17ఏళ్లు వయస్సులో మొదటిసారి సెట్లో అడుగుపెట్టాను. అలా ఐదేళ్లు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి 22 ఏళ్లకు దర్శకత్వం ప్రారంభించాను. ఇప్పుడు నా వయసు 44 ఏళ్లు. సగం జీవితం సినిమా సెట్లలోనే గడిచిపోయింది. అదేంటో తెలీదు కానీ ఆ వాతావరణంలో నేను నాకు నచ్చినట్లు ఉండగలను. సామాజిక కార్యక్రమాల్లో, ఈవెంట్లలో నేను మాములుగా ఉండాలని ప్రయత్నించినా ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటి ప్రదేశాల్లో కేవలం దర్శకుడిగా మాత్రమే ఉంటాను. సెట్లో మాత్రం అలా కాదు నాకు అక్కడ ఉన్నంత సౌకర్యంగా మరెక్కడా ఉండలేను. జీవితమంతా ఇలానే గడిచిపోవాలని కోరుకుంటున్నాను. నిజజీవితంలో కంటే సెట్లోనే స్నేహితులను దక్కించుకున్నాను’ అని తెలిపారు.