Sai Pallavi: త్వరలో సాయి పల్లవి పెళ్లి? వరుడు ఎవరో తెలుసా..

Sai Pallavi

Sai Pallavi

Sai Pallavi: సౌత్ టు నార్త్ వరుస భారీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందా? మొన్నటివరకు పెళ్లి ఊసెత్తితేనే ఆమడదూరం పరిగెత్తిన ఈ భామ.. ఇప్పుడు ఏడడుగులు వేసేందుకు రెడీ అయిపోయిందా? తాజాగా ఆమె మాట్లాడిన మాటలు వింటే అవుననే సంకేతాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తనకు కాబోయే భర్త ఎవరు, అతనిలో ఎలాంటి లక్షణాలు ఉండాలో స్వయంగా సాయి పల్లవే బయటపెట్టడంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మొన్నటివరకు కెరీర్, సినిమాలే ప్రపంచంగా గడిపేసిన సాయి పల్లవి.. పెళ్లి గురించి అడిగినప్పుడల్లా “ఇప్పుడే పెళ్లా.. అస్సలు ఆ ఆలోచనే లేదు” అంటూ తప్పించుకునేది. కానీ తాజాగా అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోలో ఆమె చేసిన కామెంట్స్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాయి. కాబోయే వాడు ఎలా ఉండాలనే దానిపై బిగ్ బి అడిగిన ప్రశ్నకు సాయి పల్లవి చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది.

చాలామంది హీరోయిన్లలాగా కోట్లు సంపాదించే ఆస్తిపరుడో లేక అందగాడో కావాలని ఆమె కోరుకోలేదు. తనను పెళ్లాడే వ్యక్తి ముందుగా మంచి మనిషై ఉండాలని, స్వార్థం లేనివాడై ఉండాలని తేల్చి చెప్పింది. తప్పు జరిగితే నిజాయితీగా ఒప్పుకోవాలని తప్ప, ఇతరులపై నిందలు వేసే మనస్తత్వం అస్సలు ఉండకూడదని తన మనసులోని మాటను బయటపెట్టింది. ఎప్పుడూ పెళ్లి ప్రస్తావనను కొట్టిపారేసే సాయి పల్లవి.. ఇప్పుడు కాబోయే భర్తకు ఉండాల్సిన క్వాలిటీస్ గురించి ఇంత వివరంగా చెప్పిందంటే, ఆమె లైఫ్‌లోకి ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఎంట్రీ ఇచ్చే సమయం దగ్గరపడిందా అనే గుసగుసలు మొదలయ్యాయి. వరుడు ఎలా ఉండాలో సాయి పల్లవి డిసైడ్ అయిపోయింది కాబట్టి, ఇక ఆ మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరో త్వరలోనే బయటకు రావడం ఖాయం అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు.