దక్షిణాది భామలు బాలీవుడ్ లో తమ సత్తాను చాటుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ముందుగా టాలీవుడ్ లో పరిచయమైన ఇలియానా, తాప్సి తదితరులు బాలీవుడ్ లో హీరోయిన్లుగా రాణించారు. ఇటీవల కన్నడ సోయగం రష్మిక మందన్న రెండు హిందీ ఆఫర్లను దక్కించుకుంది. “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2″తో సమంత కూడా నార్త్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తాజా సమాచారం ప్రకారం సౌత్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవికి బాలీవుడ్ లో భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. సాయి పల్లవి ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని చెబుతున్నారు.
Also Read : వ్యాపారితో జాక్విలిన్ వ్యవహారం! కొత్త ఇంట్లో త్వరలోనే కాపురం!
సాయి పల్లవి తన యాక్టింగ్, డ్యాన్స్ స్కిల్స్ తో బాలీవుడ్ సినీ ప్రియులను ఆకట్టుకుంటుందేమో చూడాలి. ఈ వార్తలు గనుక నిజమైతే సాయి పల్లవికి మంచి అవకాశం దక్కినట్లే. అయితే సాయి పల్లవి ఈ విషయంపై స్పందించాల్సి ఉంది. ఇక ఈ ఫిదా బ్యూటీ ప్రస్తుతం దక్షిణాదిలో బహుళ భాషా చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె నాగ చైతన్య నటించిన “లవ్ స్టోరీ”, రానా దగ్గుబాటి నటించిన “విరాటా పర్వం” చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నానితో జంటగా సాయి పల్లవి నటిస్తున్న”శ్యామ్ సింగ రాయ్” చిత్రం నిర్మాణ దశలో ఉంది.